పాపం అమలను పీకేశారా? నిజమేనా?

Update: 2016-08-23 09:30 GMT
అసలు ఏ సినిమా సైన్ చేసిందని కుటుంబంలో గొడవలు పరాకాష్టకు చేరుకుని.. చెన్నయ్ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ ఫైల్ చేసేవరకు వచ్చిందో.. ఇప్పుడు అదే సినిమానుండి ఈమెను తప్పించారని టాక్ వస్తోంది. అనవసరంగా తమిళ ఇండస్ర్టీతో గొడవలు పడటం ఇష్టంలేని హీరో ధనుష్‌.. చూస్తుంటే హీరోయిన్ అమలా పాల్ కు బాగానే జలక్ ఇచ్చాడని అంటున్నారు.

నిజానికి తన భర్త - దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తో అమలా పాల్ కు గొడవలు వచ్చిందే.. ఆమె కొన్ని పెద్ద హీరోల సినిమాలు సంతకం. అందులో ఒకటి సూర్యతో చేసిన సినిమా అయితే.. రెండోది ధనుష్‌ తో చేయాల్సిన ''వడా చెన్నయ్'' మూవీ. అయితే ఆ మధ్యన అమల మామగారు.. ప్రొడ్యూసర్ అళగప్పన్.. అమలను దూరంగా పెట్టాలని తనకున్న పవర్ అంతా వాడి మరీ తమిళ ఇండస్ర్టీకి కన్వే చేశారనే రూమర్లు వచ్చాయి. అవి నిజమో ఏమో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం వడా చెన్నయ్ సినిమా నుండి అమలను తీసేశారని.. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. అసలు ఏ సినిమా కోసమైతే ఫ్యామిలీలో గొడవలై చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందో.. చివరకు ఆ సినిమా చేయకపోవడం అంటే.. మానసికంగా అది అమలకు పెద్ద దెబ్బే.

సర్లేండి.. ఇంతవరకు ఏ న్యూస్ కూడా అఫీషియల్ గా బయటకు రాని క్రమంలో.. అసలు ''వడా చెన్నయ్'' అనే ప్రాజెక్టుకు ఏదో శాపం ఉందేమో అనిపిస్తోంది. అప్పట్లో చాలామంది హీరోయిన్లను అనుకున్నతరువాత చివరకు సమంతను ఓకె అన్నారు. కట్ చేస్తే ఆమె తప్పుకోవడంతో అమల వచ్చింది. ఇప్పుడు ఈమెను కూడా మారుస్తున్నారు. అసలు ఈ సినిమాకు హీరోయిన్ సెట్టవ్వుద్దంటారా?
Tags:    

Similar News