ఆ డైవర్స్ గురించి ఏమంటోందంటే..

Update: 2017-08-14 13:06 GMT
సినిమా ఫీల్డ్ లో సెలబ్రెటీల మధ్య ప్రేమలు చిగురించడం చాలా కామన్..అదే విధంగా ఆ ప్రేమ కొన్ని రోజులకే పెటాకులవ్వడం మరింత కామన్. ఈ తరహా వార్తలు నెలకొకటి చూస్తూనే ఉంటాం. ఆనందంగా ఒకరినికొకరం చాలా అర్ధం చేసుకున్నాం అని  పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కాంట్రవర్సీలతో మీడియా అడిగే ప్రశ్నలకు కస్సుబుస్సులాడడం తరాలకు అలవాటే. అలాగే ఎన్ని సార్లు తిట్టినా కొన్ని మీడియాలు చానెళ్లు కూడా అలాంటి ప్రశ్నలే అడగడం కూడా మానుకోదు. అలాంటి ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న నటి అమలాపాల్.

దైవ తిరుమగళ్( నాన్న) సినిమాలో సపోర్టింగ్ యాక్టర్ గా నటించి ఆ చిత్ర దర్శకుడైన  ఏ.ఎల్ విజయ్ తో స్నేహం పెంచుకుంది. ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా కొనసాగించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏమైందో ఏమో గాని రెండేళ్లకే అతనితో డైవర్స్ తీసుకొని వార్తల్లో నిలిచింది అమలాపాల్. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఈ విషయం  గురించి ప్రస్తావన రాగానే అమలాపాల్ కొన్ని విషయాలను తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ''నా వైవాహిక జీవితం విజయ్ తో చాలా హ్యాపీగా గడిచింది. అసలు ఏమి ఇబ్బందులు పడలేదు. కాకపోతే కొందరి సినీ ప్రముఖుల వల్ల మా మధ్య దూరం పెరిగిందని అలాగే కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది'' అని చెప్పుకొచ్చింది.

''ముఖ్యంగా మీడియాలో కథనాలు కూడా కొంత ఇబ్బంది పెట్టాయి. అలాగే జీవితం మనం అనుకున్నట్లు కొనసాగదు కదా. సో నేను జరగబోయేదాని గురించి ఆలోచించి నా భవిష్యత్తు కోసమే ఓ దారిని ఎంచుకున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను'' అని వివరించింది అమలాపాల్. అలాగే మళ్లీ పెళ్లి  ప్రస్తావన రాగానే కొంచెం ఘాటుగానే సమాధానాన్ని ఇచ్చింది ఈ మలయాళీ భామ. ''ప్రేమ నాకు నచ్చదు అనే స్థితిలో అయితే నేను లేను గాని  పెళ్లి మాత్రం తప్పకుండా చేసుకుంటా'' అని చెప్పేసింది. అయితే అంతకంటే ముందు నన్ను నేను ఇష్టపడి కెరీర్ పై ద్రుష్టి సాధిస్తానని చెబుతూ.. అనుకున్నవన్నీ జరిగితే పెళ్లి కూడా జరుగుతుందని జవాబిచ్చింది అమలాపాల్.

మరి విజయ్ మీద ఏ కోపం లేదంటూనే చాలా సార్లు చెప్పి అతనికి సపోర్ట్ కూడా చేసిన ఈ హీరోయిన్ ఎందుకు విడిపోయిందో మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. ఆ విషయం కూడా  ఎవ్వరికి తెలియదు వాళ్లకు తప్ప.     
Tags:    

Similar News