అమీషా పటేల్.. ఈ పేరు వింటే అందరికి పవర్ స్టార్ నటించిన ‘బద్రి’ సినిమా గుర్తొస్తుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో సినీఇండస్ట్రీలో అడుగుపెట్టింది అమీషా. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసాక తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. నాని, నరసింహుడు, పరమవీరచక్ర’ సినిమాల్లో కనిపించింది. తెలుగులో చివరిగా ‘ఆకతాయి’ అనే సినిమా టైటిల్ సాంగ్‌లో ఆడిపాడింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎల్లప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే అమీషా ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. కానీ ఇప్పటికి పలు వివాదాల నుండి బయటపడేలేక పోయింది అమీషా.
ఇండస్ట్రీలో అమీషా కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇక లాభం లేదని స్వయంగా ప్రొడక్షన్ లోకి దిగింది. దేశీ మ్యాజిక్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఆ సినిమా వివాదం ఇప్పటికి అమీషాను వెంటాడుతూనే ఉంది. ఆ సినిమాకు అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఫైనాన్సియర్‌గా వ్యవహరించాడట. దురదృష్టం కొద్దీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయి నష్టాలు మిగిల్చిందట. అయితే ఆ సినిమాకు పెట్టిన 2.5కోట్ల పెట్టుబడి చెల్లించకుండా చీటింగ్ చేసిందంటూ అజయ్ కుమార్ సింగ్ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ కేసు కోర్టులో ఉండగానే అమీషా పై పుకార్లు చెలరేగాయి. తాజాగా అమీషా ఆ పుకార్ల పై స్పందిస్తూ.. పాత వివాదాలను టార్గెట్ చేసి తన వృత్తికి, వ్యక్తిగత జీవితానికి డామేజ్ చేసే విధంగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అవే తోడుకుంటూ లైఫ్ ఎంజోయ్ చేయండి' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడి రిప్లై చర్చలకు దారితీస్తోంది.