నన్ను అమీషా అని పిలుస్తారా? ఎంత ధైర్యం

Update: 2016-08-07 13:30 GMT
బద్రి సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది అమీషా పటేల్. అమ్మడి కహోనా ప్యార్ హై ఛమక్కులు ఎందుకో టాలీవుడ్ లో పెద్దగా పనిచేయలేదు. తరువాత తెలుగులో ఓ రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ.. అవన్నీ ఫెయిల్ అయ్యాయ్. అయితే బాలీవుడ్ లో కూడా అమ్మడు పెద్దగా సక్సెస్ అవ్వలేదులే. సినిమాలు ఆడినా కూడా.. యాటిట్యూడ్ కారణంగా కెరియర్ దొబ్బిందని టాక్ ఉంది.

కాకపోతే ఆ మధ్యన సొంత సినిమా అదీ ఇదీ అంటూ హడావుడి చేస్తూ.. దాదాపు మూడేళ్ళ తరువాత ఇప్పుడు మీడియాతో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. 41 ఏళ్ళ వయసొచ్చినా కూడా ఇంకా హాటు హీరోయిన్ గానే నటిస్తూ.. ఇప్పుడు మీడియా మీద ఫైర్ అవుతోంది అమ్మడు. మూడేళ్లుగా ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఓ విలేకరి అడుగగా.. 'నన్ను అమీషా అని కాదు.. అమీషాజీ అని పిలువండి' అంటూ అరిచేసిందట అ బంగారం. పాపా.. అక్కడ షారూఖ్‌ ఖాన్‌ను కూడా.. షారూఖ్‌ తుమ్ ఏ డైరక్టర్ కో క్యోం ఛాన్స్ దియా అంటూ ఏకవచనంలో సంభోదిస్తున్నారు మీడియా వారు. అలా పిలుస్తుంటే.. ఆ హీరోలు కూడా హ్యాపీయే. అలాంటప్పుడు అమీషాను ఏమని పిలుస్తారు?

ఏంటో.. ఒకప్పుడు ప్రిన్సెస్ లాంటి హీరోయిన్ అనుకుంటే ఇప్పుడు మాత్రం చీప్ గా రాఖీ సావంతా లా బిహేవ్ చేస్తోంది. సినిమా కెరియర్ ఫెయిల్ అవ్వడంతో ఈ ఫారిన్ యునివర్సిటీ ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఇలా తయారైంది కాబోలు.
Tags:    

Similar News