బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందేగా. అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న స్టార్లలో అమితాబ్ దే అగ్రస్థానం. అటు ఫేస్ బుక్ తో పాటు ఇటు ట్విట్టర్ లోనూ అమితాబ్‌కు లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్నారు. తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా అభిమానులతో పంచుకోవాలనిపిస్తే... నేరుగా ఫేస్ బుక్కో - లేదంటే ట్విట్టర్ నో ఓపెన్ చేసే అమితాబ్... ఆ విషయాలను ఫొటోలతో సహా పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడైతే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు విశేష సంఖ్యలో ఫాలోయర్లు నమోదయ్యారు గానీ... మొన్నటిదాకా సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోయర్లు కలిగిన స్టార్ గా అమితాబ్ కు పేరుంది. అయితే సోషల్ మీడియా ఆయనను చాలా ఇబ్బంది పెడుతున్న మాట ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ విషయాన్ని వేరెవరో చెప్పలేదు... స్వయంగా అమితాబే తన ఇబ్బందిని చెబుతూ విచారం వ్యక్తం చేశారు. అయినా సోషల్ మీడియాలో అమితాబ్ ను ఇబ్బంది పెట్టిన ఫ్లాట్ ఫామ్ ఏదంటే... ఫేస్ బుక్కేనట.
అయితే ఈ విషయాన్ని ఆయన వేరెవరికో చెప్పలేదు. నేరుగా తనను ఇబ్బంది పెడుతున్న ఫేస్ బుక్కుకే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కూడా ఆయన ఫేస్ బుక్ లోనే పోస్ట్ చేయడం విశేషం. అయినా ఫేస్ బుక్ బిగ్ బీని ఎలా ఇబ్బంది పెట్టిందన్న విషయానికి వస్తే... లక్షలాది మంది ఫాలోయర్లతో బిగ్ బీ ఫేస్ బుక్ ఖాతా... నిత్యం యాక్టివ్ గానే ఉంటోంది. ఇటీవలి కాలంలో అమితాబ్ తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేస్తే... అది పూర్తిగా ఓపెన్ కావడం లేదట. ఈ కారణంగా తన అభిమానులు పంపిన సందేశాలను అమితాబ్ పూర్తిగా చూసుకోలేకపోతున్నారట.
ఈ తరహా ఇబ్బందిని గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అమితాబ్... తన ఖాతా మరింత స్లో అయిపోవడంతో... మొన్న ఆదివారం ఈ ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్ కే పంపిన సదరు ఫిర్యాదులో అమితాబ్ ఏమని పేర్కొన్నారంటే... *హలో ఫేస్ బుక్... మేల్కో. నా పేజీ పూర్తిగా ఓపెన్ కావడం లేదు. చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఫిర్యాదు చేసేందుకే నేను దీనిని వాడాలా? విచారకరం* అని అమితాబ్ ఆ పోస్ట్ లో ఆసక్తికరంగా కంప్లెయింట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/