బాహుబలి క్రేజ్ పై అమూల్ కార్టూన్

Update: 2017-05-04 09:38 GMT
దేశంలో జరిగిన అనేక కరెంట్ ఎఫైర్స్ ను తీసుకుని.. వాటి ఆధారంగా బిజినెస్ యాడ్స్ చేయడం ఒక మంచి మంత్ర అనే చెప్పాలి. అది ఒక రకంగా జనాలుకు దగ్గరకావడానికి ఒక దారి. దీన్ని పొల్లు పోకుండా పాటిస్తున్న సంస్థ దేశంలో గొప్ప పాల ఉత్పత్తి కంపెనీ అమూల్ పాలు. ఈ బ్రాండ్ వారు రోజూ వేసే కార్టూన్లు చూస్తే మీకు ముచ్చటేస్తుంది.

దంగల్ విడుదల అయినప్పుడు కూడా దంగల్ ది బైట్.. ప్రతీ పిల్లకి అవసరమైంది అని చెప్పుతూ కార్టూన్ వేశారు. ఇలా క్రికెట్ కావచ్చు ప్రభుత్వ పధకం కావచ్చు వివక్షత పైన కావచ్చు లోకపాల్ బిల్ కావచ్చు.. అంటే దేశం మొత్తం ఏదైతే మాటలాడుకుంటుందో దాన్ని గురించి కార్టూన్ వస్తుందనమాట. అది సపోర్ట్ గానా సెటైర్ గానా అనేది సదరు వార్తపై ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఎవ్వరిని తక్కువ చేసి చూపారు. ఇప్పుడు దేశం మొత్తం ఒకే సినిమా గురించి డిస్కస్ చేస్తోంది.. అదే రాజమౌళి బాహుబలి. చిన్నవాళ్లు పెద్దవాళ్ళు మనవాళ్లు పరాయివాళ్లు ఇలా అందరూ ఒకే సినిమా కోసం ఎదురుచూసి ఆ నిరీక్షణను ఆనందిస్తున్నారు. అందుకే అముల్ పాలు వాళ్ళు బాహుబలిని  తన రెగ్యులర్ కార్టూన్ కాన్సెప్ట్ లో వాడుకున్నారు.

బాహో సే బెల్లి తక్! అని చెబుతూ బాహుబలి ఘన విజయమును ఎంజాయ్ చేయమని మా పాలును తాగమని కార్టూన్ ఇచ్చారనమాట. అమల్ బాబు ఏమో ఏనుగు పై ఎగిరి అమూల్ వెన్న తింటున్నట్లు.. అమూల్ పాపేమో విల్లు పట్టుకొని గురి చూస్తునట్లు పెట్టి పిల్లలకి బాగా కనెక్ట్ చేశారు. బాహుబలి సినిమా వీరాన్ని పిల్లకు పాల మమకారం జోడించి  చెప్పడం అందరినీ ముఖ్యంగా బాహుబలి అభిమానులునుకు మంచి అనుభూతిని ఇచ్చింది.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News