తమిళ్ బెటర్ అంటున్న బస్టాప్ భామ

Update: 2017-07-05 05:07 GMT
బస్టాప్ మూవీతో సినిమా కెరీర్ ప్రారంభించిన వరంగల్ బ్యూటీ ఆనంది. ఆ తర్వాత ప్రియతమా నీవచట కుశలమా.. నాయక్.. గ్రీన్ సిగ్నల్ సినిమాల్లో కనిపించిందంతే. అక్కడి నుంచి వరుసగా తమిళ్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఏడాదికి 3-4 తమిళ్ సినిమాలు చేసేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న 5 కోలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయంటే.. ఆనంది జోరు అర్ధమవుతుంది.

ఇలా తమిళ్ సినిమాలే చేయడానికి కారణం ఏంటో తనే చెప్పేసింది ఆనంది. 'ఇక్కడ నాకు వచ్చిన రోల్స్ కంటే.. తమిళ మూవీస్ లో వచ్చిన ఆఫర్లలో కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. పాత్రల పరంగా నేను బాగా గమనించిన విషయం ఇది. అందుకే తమిళ్ మూవీస్ నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నిజానికి నేను ఇక్కడకు కేవలం వర్క్ కోసమే వచ్చాను. అంతే కాదు.. నేను ప్రస్తుతం ఎంబీఏ పూర్తి చేస్తున్నాను. నా వరకు నాకైతే ఎకడమిక్స్ చాలా ముఖ్యం. ఒకేసారి అనేక పనులు చేసేయాలని అనుకోవడం లేదు' అని చెప్పింది బస్టాప్ బ్యూటీ.

ప్రస్తుతం ఈమె తన కొత్త సినిమా పండిగై చిత్రం కోసం ప్రచారం చేస్తోంది. ఈ సినిమాలో అత్యంత క్లిష్టంగా అనిపించిన సీన్ గురించి కూడా చెప్పింది ఆనంది. 'జుట్టు బాగా మెరిసేందుకు ఓ బీర్ తెచ్చిపెట్టమని అడిగే సీన్ ట్రైలర్ లో ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా నేను ఇది ట్రై చేశాను' అంటూ నవ్వేస్తున్న ఆనంది.. ఈ సినిమాలో బీర్ తాగి ఓ సన్నివేశాన్ని చేయాల్సి ఉండగా.. దాని కోసం బాగా కష్టపడాల్సి వచ్చిందట.
Tags:    

Similar News