'లైగర్' ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ..పూరి జగన్నాధ్..ఛార్మీతో పాటు హీరోయిన్ అనన్య పాండే ఒక్కసారిగా కామ్ అయిపోయింది. సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ అందించడంలో వేగం తగ్గిపోయింది. లైగర్ రిలీజ్ కి ముందు చలాకీగా కనిపించిన అమ్మడు అటుపై అదే ఉత్సాహాన్ని చూపించలేకపోయింది. బాలీవుడ్ పరిశ్రమలో కొన్ని వ్యక్తిగత కారణాలు అమ్మడిలో వేగాన్ని తగ్గించినట్లు కనిపిస్తుంది.
తాజాగా కొత్త సినిమా రిలీజ్ విషయంలో అనన్యకి అలాంటి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అమ్మడు నటించిన డ్రీమ్ గర్ల్ -2 రిలీజ్ విషయంలో జరుగుతోన్న జాప్యం గురించిచెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ ఓసారి ముందుకి..మరోసారి వెనక్కి వెళ్తుంది. వచ్చే ఏడాది జూన్ 29న రిలీజ్ చేస్తున్నట్లు ముందు ప్రకటించారు. ఆ తర్వాత వారం ముందుగా 23నే రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పుడా తేదికి కూడా రావాడం లేదు. జులై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారుట. మరి ఆతేదికన్నా రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. ఇలా ఇన్ని తేదీలు మారేసరికి ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై విసుగు పుట్టింది. ఇలా ఇన్ని డేట్లు మారడం కన్నాపూర్తిగా రిలీజ్ చేయకపోవడం మంచిదంటూ ఓ నెటి జనుడు కామెంట్ పెట్టాడు.
ప్రేక్షకులే కాదు ఈ విషయంలో అనన్య కూడా అలాగే ఫీలవుతుందిట. 'లైగర్' ప్లాప్ తర్వాత వీలైనంత త్వరగా హిట్ అందుకుని ప్లాప్ ముద్రని చెరుపుకోవాలని ఆరాటపడుతుంది. వచ్చే విజయంతో కొత్త సినిమాలకు సైన్ చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. కానీ సినిమా రిలీజ్ అవ్వడం కనిపించలేదు. అనన్య సంతకాలు చేయడం అంతకుమించి కానరావడం లేదు.
మరి అనన్య నిరీక్షణ ఫలించేది ఇంకెప్పుడో. అనన్య నటిస్తోనన మరో హిందీ సినిమా 'కోహో గయే హమ్ ఖాన్' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇలా రెండు సినిమాల మధ్య లో అనన్య నలిగిపోతుంది. అవి రిలీజ్ అయితే గానీ అమ్మడికి కొత్త ఛాన్సులు రావడం కష్టమవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.