మోస్ట్ వెయిటెడ్ 'వకీల్ సాబ్' మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అంజలి.. నివేథా థామస్ మరియు అనన్య నాగళ్లలు కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇప్పటికే 'మల్లేశం' సినిమాలో నటించి మెప్పించింది. మల్లేశం సినిమా తర్వాత వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్రను చేసే అవకాశంను దక్కించుకున్న ఈ తెలుగమ్మాయి చేతిలో ప్రస్తుతం పలు ఆఫర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కొత్త సినిమాను ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
వకీల్ సాబ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. మల్లేశం సినిమాలో నన్ను చూసిన దర్శకుడు వేణు గారు సినిమాలో కీలక పాత్ర కోసం ఆడిషన్స్ అంటూ పిలిచారు. మూడు సార్లు ఆడిషన్స్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. సినిమాలో ఎంపిక అయ్యి షూటింగ్ ఆరంభంకు ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమా అని తెలిసిందని అనన్య చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో పవన్ ఆడవారి సమస్యల గురించి ఎంతో మాట్లాడేవారు. ఆయనతో గంటల కొద్ది మాట్లాడిన విషయాలు ఎప్పటికి మర్చిపోలేను అంది.
ఇక టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు రాణించలేక పోవడంకు కారణం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో కొందరు తెలుగు అమ్మాయిలు ఇది చేయలేరు అది చేయలేరు అనే మైండ్ సెట్ తో ఉన్నారు. వారు కనుక ఆ మైండ్ సెట్ ను మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలు భవిష్యత్తులో టాలీవుడ్ లో మంచి హీరోయిన్స్ గా పేరు దక్కించుకుంటారనే నమ్మకంను అనన్య వ్యక్తం చేసింది.