ఐటెం సాంగ్.. అనే మాటెత్తితే మండిపోతోంది అనసూయ. తనకు ‘ఐటెం’ అనే మాట అంటేనే అసహ్యం అంటోందామె. ఐటెం సాంగ్స్ ను ఇకపై అందరూ స్పెషల్ సాంగ్స్ అనాలని నొక్కి వక్కాణిస్తోంది అనసూయ. బేసిగ్గా తనకు ఈ స్పెషల్ సాంగ్స్ అంటే అంత ఆసక్తి లేదని.. ఐతే ‘విన్నర్’ మూవీలో చేసిన పాట చాలా స్పెషల్ కాబట్టే అందులో చిందులేయడానికి ఒప్పుకున్నానని అనసూయ చెప్పింది. ఈ స్పెషల్ సాంగ్స్ మీద అనసూయ ఫీలింగ్ ఏంటంటే..
‘‘నాకు ఐటెం సాంగ్ అనే పదమంటేనే అసహ్యం. మేం నటులం కానీ.. వస్తువులం కాదు. అలాంటపుడు ‘ఐటెం’ అనే మాట ఎలా వాడతారు. ఈ కల్చర్ బాలీవుడ్ వాళ్ల నుంచి వచ్చింది. స్పెషల్ స్టార్స్ చేస్తారు కాబట్టి వీటిని స్పెషల్ సాంగ్స్ అనాలి తప్ప ఐటెం సాంగ్స్ అనకూడదు. నాకు నిజానికి ఈ తరహా స్పెషల్ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదు. ఇంతకుముందు ఇలాంటి ఆఫర్లు వస్తే అంగీకరించలేదు.
ఐతే విన్నర్ మేకర్స్ నన్ను సంప్రదించినపుడు ముందు లిరిక్స్ వినమన్నారు. ఆ పాట అంతా నా పేరు మీదే సాగుతుంది. చాలా సరదాగా ఉంటుంది. లిరిక్స్ అంతా విన్నాకే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నా. ‘క్షణం’ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చినా కూడా అంగీకరించలేదు. ఈ పాటకు స్టెప్పులేస్తున్నపుడు అది సుమగారు పాడారని తెలియదు. షూట్ చేసేటపుడు డమ్మీ సాంగ్ ప్లే చేశారు. కానీ తర్వాత సుమగారే ఫోన్ చేసి తాను ఈ పాట పాడానని చెప్పి సర్ప్రైజ్ చేశారు’’ అని అనసూయ తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/