సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన హాట్‌ యాంకర్‌

Update: 2019-07-07 10:55 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ బుల్లి తెరపై కాకుండా వెండి తెరపై కూడా తన సత్తా చాటుతోంది. హీరోయిన్‌ గా కాకుండా లీడ్‌ రోల్స్‌ లో అనసూయ నటిస్తూ వెండి తెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో ఈమె చేసిన రంగమ్మత్త పాత్రను ప్రేక్షకులు అంత త్వరగా మర్చి పోలేరు. ఆ చిత్రంలోని అనసూయ పాత్రకు ఫిదా అయిన మెగాస్టార్‌ చిరంజీవి తన సినిమాలో ఛాన్స్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక తాజాగా అనసూయ సంచలన ప్రకటన చేసింది.

ప్రస్తుతం ఈమె అమెరికా వాషింగ్టన్‌ లో జరుగుతున్న తానా వేడుకల్లో పాల్గొంది. ఆ సందర్బంగా అనసూయ మాట్లాడుతూ తన భవిష్యత్తు ప్రణాళికలను వెళ్లడించింది. భవిష్యత్తులో తాను సినిమా నిర్మాతగా మారబోతున్నట్లుగా చెప్పింది. కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలను నిర్మించాలని భావిస్తుందట. కొత్త వారిని ప్రోత్సహిస్తూ చిన్న బడ్జెట్‌ సినిమాలు తీయాలనే ఆలోచనలో ఈ అమ్మడు ఉందని పేర్కొంది.

ఒక వైపు బుల్లి తెరపై యాంకర్‌ గా కొనసాగుతూనే మరో వైపు నటిగా వరుసగా చిత్రాల్లో నటిస్తోంది. ఇదే సమయంలో వెబ్‌ సిరీస్‌ లో నటించడంతో పాటు సినిమాలను నిర్మించడంపై కూడా అనసూయ దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే అనసూయ నిర్మాణంలో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందన్న మాట. సినిమా గురించిన చర్చలు జరుగుతున్నాయా లేదా అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే అనసూయ ఇవ్వలేదు. కాని భవిష్యత్తులో అనసూయ నిర్మించడం మాత్రం కన్ఫర్మ్‌ అయ్యింది.
Tags:    

Similar News