లాస్య దీపావళి స్పెషల్ సాంగ్ లో అమృత ప్రణయ్.. వైరల్ వీడియో

Update: 2021-11-05 14:52 GMT
బుల్లితెర యాంకర్ లాస్య గురించి తెలియని వారుండరు. బిగ్ బాస్ లో సందడి చేశాక.. కామెడీ షో సహా పలు టీవీ కార్యక్రమాల్లో లాస్య పాలుపంచుకుంటోంది. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా యాంకర్ లాస్య ఒక ప్రత్యేక వీడియోను లాంచ్ చేసింది.

ఈ వీడియోలో పరువు హత్యలో భర్తను కోల్పోయిన అమృత కనిపించడం విశేషం. అమృత ప్రణయ్.. యాంకర్ లాస్యతో కలిసి అడుగులు కలపడం విశేషంగా ఆకట్టుకుంది.

ఈ వీడియోలో గలాటా గీతూ, అలేఖ్య  కలిసి ఈ అద్భుతమైన వీడియోలో సందడి చేశారు. నవంబర్ 3న ఈ వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పటికే 6 లక్షల వ్యూస్ దాటేసింది. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ట్రెండింగ్ లో నిలిచింది.

లాస్య తనదైన  స్టెప్పులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా.. తొలిసారి అమృత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి అభిమానులను ఫిదా చేసింది. పింక్ డ్రెస్ లో ముచ్చటగా కనిపించింది. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను అమృత కూడా పోస్ట్ చేసుకుంది. ఇదిప్పుడు వైరల్ గా మారింది.

Full View
Tags:    

Similar News