బుల్లితెరపై బాగా ఫేమస్ అయిన యాంకర్లలో లాస్య ఒకరు. ఇటీవలే మంజునాథ్ అనే వ్యక్తితో ఎంటేజ్మెంట్ చేసుకున్న లాస్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే కలిసి మాట్లాడుతూ.. కొన్ని సంచలన విషయాలు చెప్పింది. తనకు లవర్ ఉన్నాడని తెలిసి తనను పెళ్లి చేసుకుంటానంటూ అప్పటికే పెళ్లయిన తన కో యాంకర్ ఒకరు ఇబ్బంది పెట్టినట్లు లాస్య చెప్పింది.
‘‘నాతో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన అతడికి. ఇంతకుముందే పెళ్లయింది. పైగా నాకు లవర్ కూడా ఉన్న సంగతి అతడికి తెలుసు. అయినప్పటికీ అతను నాకు ప్రపోజ్ చేశాడు. తన భార్యకు విడాలకులిచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అది నన్ను ఎంతో బాధించింది. అది కరెక్ట్ కాదని నాకనిపించింది.ఇలా ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు. అది జరిగినప్పటి నుంచి అతడికి దూరంగా ఉంటున్నాను’’ అని లాస్య తెలిపింది.
మరోవైపు తనతో చాన్నాళ్ల పాటు కలిసి యాంకరింగ్ చేసిన రవితో తనకు విభేదాలు వచ్చాయని.. అతడితో కలిసి మళ్లీ యాంకరింగ్ చేయనని లాస్య స్పష్టం చేసింది. ‘‘యాంకర్ రవికి.. నాకు విభేదాలు వచ్చిన మాట నిజమే. మా మధ్య క్లాషెస్ వచ్చాయి. రవికి,.. నాకు మధ్య ఏదో ఉందని వార్తలు తెగ ప్రచారం అయిపోయాయి. ఆ రూమర్లు మా కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే రవితో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయను’’ అని లాస్య తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/