‘పిచ్చైక్కారన్’పై బ్రాహ్మణుల మండిపాటు

Update: 2016-03-10 12:30 GMT
తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ... తానే స్వయంగా నిర్మించిన చిత్రం ‘పిచ్చైక్కారన్’. సంగీతం కూడా ఆయనే అందించాడు. శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే తమిళనాట విడుదలై వివాదాస్పదమైంది. ఎంతో మెసేజ్ వున్న సినిమా అని ఈ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం పన్నురాయితీ కూడా కల్పించింది. అలాంటి సినిమాపై ఇప్పుడు బ్రాహ్మణులు కారాలు మిరియాలు నూరుతున్నారంటే... ఈ సినిమా వారి మనోభావాలను ఎలా గాయపరిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు వారికి ఆగ్రహం తెప్పించే అంశాలు ఇందులో ఏమున్నాయని అంటున్నారంటే... ‘ఆలయంలో వున్నవారు బిక్షగాళ్లే...ఆలయం బయట వున్నొళ్లు బిక్షగాళ్లే’ అనే డైలాగ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వుందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ... తమిళనాడు అందనర్ మున్నేట్ర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు చెన్నైలోని బ్రహ్మణుల అసోసియేషన్ తో కలిసి చెన్నై పోలీస్ కమిషనర్ కు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఇందులో గాయత్రీ మంత్రాన్ని వాడుకున్నారని, కొన్ని సన్నిశేశాలు చాలా అభ్యంతరకరంగా వున్నాయంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళనాడు అందనర్ మున్నేట్ర సంఘం ప్రధాన కార్యదర్శి గురు విజయ్ శర్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
Tags:    

Similar News