నైట్ షోలకు ‘జై’ కొట్టారు

Update: 2018-01-11 10:45 GMT
అజ్ఞాతవాసికి స్పెషల్ కేస్ కింద రాత్రి షోలు - అదనపు రేట్లకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి బాలయ్య జైసింహకు కూడా ఇస్తారా లేదా అనే అనుమానాలకు తెర పడింది. జైసింహను కూడా అర్ధ రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ఆటలు ప్రదర్శించేలా ఎపి సర్కార్ అధికారిక అనుమతులు ఇచ్చేసింది. ఇది 16వ తేది వరకు అమలులో ఉంటుంది. దీంతో ఈ రోజు రాత్రి నుంచే నందమూరి అభిమానులు సందడి చేయటం మొదలు పెట్టబోతున్నారు. తెలంగాణాలో యధావిధిగా రెగ్యులర్ టైంలోనే షోలు కొనసాగనున్నాయి. జైసింహకు కూడా టికెట్ ధరల విషయంలో వెసులుబాటు ఇచ్చారా లేదా అనే స్పష్టత లేదు కాని ఆంధ్ర ప్రదేశ్ లోని జైసింహ థియేటర్లలో రెగ్యులర్ టికెట్ ధరలకే అడ్వాన్సు బుకింగ్ పెట్టేసారు. సో దాని ఆలోచన, చర్చ అనవసరం.

అజ్ఞాతవాసి డివైడ్ టాక్ ని బాలయ్య ఎంత వరకు ఉపయోగించుకుంటాడో రేపు తేలనుంది. ఫక్తు మాస్ మాస్ మసాలా మూవీగా తెరకెక్కిన జైసింహలో బాలయ్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తుండగా నటాషా - హరిప్రియ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అతి కీలకమైన మెయిన్ హీరొయిన్ రోల్ లో నయనతార స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. దర్శకుడు కెఎస్ రవికుమార్ దీన్ని అగ్ర హీరోతో తమిళ్ లో కూడా రీమేక్ చేస్తాను అని చెప్పడం చూస్తే కంటెంట్ మీద ఆయన కాన్ఫిడెన్సు తెలుస్తోంది. మరి జైసింహతో బాలకృష్ణ రికార్డులు సృష్టిస్తాడని ఫాన్స్ గట్టి నమ్మకంతో ఉండగా సంక్రాంతి పండక్కి అచ్చ తెలుగు మాస్ సినిమా ఇదే కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. రేపు ఈ టైంకంతా జైసింహ రిపోర్ట్ కార్డు వచ్చేస్తుంది కాబట్టి అందాక వెయిట్ చేసి చూద్దాం.
Tags:    

Similar News