ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `అరవింద సమేత` ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఒకరోజు ముందే అంటే బుధవారం నుంచే ప్రీమియర్ షోల హడావుడి మొదలుకానుంది. నందమూరి అభిమానులు సహా కామన్ ఆడియెన్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణమిది. నాన్ హాలీడే రోజున రిలీజ్ చేస్తున్నా తొలిరోజు రికార్డ్ స్థాయి వసూళ్లు సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.
అందుకు టిక్కెట్టు రేటు పెంపు! ఇతోధికంగా సాయం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి అవసరం మేర టిక్కెట్టు ధర పెంచుకునే వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వనుందని తెలుస్తోంది. . సోమవారం నాడు అందుకు సంబంధించిన ప్రకటన వస్తుందట. ఈనెల 11 నుంచి 19 వరకు టికెట్ రేట్లను పెంచుకుని విక్రయించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. నగరాలు - జిల్లాకేంద్రాల్లో రూ.200 ధర నిర్ణయిస్తే - సెకండ్ టైర్ సిటీల్లో సింగిల్ స్క్రీన్లలో టిక్కెట్టు ధర రూ.150 ఉండే ఛాన్సుందని తెలుస్తోంది. ఎలానూ వేకువఝాము అదనపు షోలు తొలి వారం ఉండనే ఉంటాయి. అంటే ఆ మేరకు ఓపెనింగ్ రికార్డులకు - తొలి వారం వసూళ్ల రికార్డులకు ఛాన్సుంటుంది.
ఎన్టీఆర్ క్రేజుతో థియేట్రికల్ రైట్స్ రూపంలో 93కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. కేవలం ఏపీలో 35కోట్ల బిజినెస్ చేశారు. అంటే ఆ మేరకు భారీగా వసూళ్లు సాధించడం అంతే ఇంపార్టెంట్. తొలివారంలోనే రికవరీ మొత్తం చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు అన్ని రకాల వెసులుబాట్లు లభించినట్టేనని చెబుతున్నారు. మరోవైపు ఓవర్సీస్ లో పలు రకాల యాప్ ల ద్వారా టిక్కెట్టు హాఫ్ రేటుకే విక్రయిస్తుండడం `అరవింద సమేత-వీరరాఘవ`కు కలిసొస్తోందిట. ఆన్ లైన్ బుకింగులు ఇప్పటికే తెరుచుకున్న సంగతి విధితమే.