కులం లేదు, మతం లేదు.. డిస్కషన్‌ అసలే లేదు

Update: 2019-01-30 12:22 GMT
కుర్రహీరో రామ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటాడు. తన సినిమా ప్రమోషన్‌ తో పాటు.. ఎప్పటికప్పుడు కొత్త డిటైల్స్ అప్‌ డేట్‌ చేస్తుంటాడు. అప్పుడప్పుడు నెటిజన్స్‌ అడిగే సమాధానాలకు కూడా చాలా తీరిగ్గా సమాధానం చెప్తాడు. ఇప్పుడు రామ్ ఇచ్చిన అలాంటి సమాధానమే అందర్ని ఆకర్షించింది. రామ్‌ తెలివైనోడు అనేలా చేసింది.

రీసెంట్‌ గా అనంతపురం జిల్లా పెనుకొండలో కియా మోటార్స్ కారుని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. ఈ సందర్భంగా.. కొన్నేళ్ల క్రితం ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ రాలేదని.. ఇప్పుడు అందరూ క్యూ కడుతున్నారని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. దీనికి రామ్‌ రెస్పాండ్‌ అయ్యాడు. రాష్ట్రాభివృద్ధికి ఇంకా చాలా పరిశ్రమలో చాలా రావాల్సి ఉందని అభిప్రాయ పడ్డాడు. ఇది చూసిన ఓ నెటిజన్‌ రామ్‌ కు ఓ చిత్రమైన కామెంట్‌ చేశాడు. నువ్వు ఆంధ్రావాడివి కాబట్టి ఏపీకి అనుకూలంగా మాట్లాడుతున్నావ్‌ అని ట్వీట్‌ చేశాడు. దీన్ని చూసిన రామ్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు.

“నా ఇల్లు సక్కపెట్టుడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు చెయ్‌.. నీకు ఇస్తా ఒక ట్వీట్‌. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే, ఇదే మాట మీదుంట. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, డిస్కషన్‌ అసలే లేదు” అంటూ సినిమాటిక్‌ స్టైల్లో రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు. దీంతో.. రామ్‌ సమాధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఎంతైనా ఇస్మార్ట్‌ శంకర్‌ కదా. సమాధానాలన్నీ పూరీ మార్క్ డైలాగ్స్‌లా ఉంటాయి.. ఈ సినిమా అయిపోయేవరకు.
   
Tags:    

Similar News