రాంచరణ్ నెక్స్ట్ సినిమా అదేనా..?

Update: 2020-03-27 09:30 GMT
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్డంని ఎంజాయ్ చేస్తున్నాడు. నేడు రాంచరణ్ పుట్టినరోజు సందర్బంగా 'ఆర్ఆర్ఆర్' టీం ఎన్టీఆర్ ద్వారా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన రాంచరణ్ 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ తో అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారు. కరోనా కారణంగా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ నిలిపేయడంతో ఇంటికే పరిమితమయ్యాడు రాంచరణ్.

ఇక లాక్ డౌన్ తరువాత 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ముగించుకొని వెంటనే తన నెక్స్ట్ సినిమా చేద్దామని ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈసారి మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీతో వద్దాం అనుకోని ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరూ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి కథను విన్నాడట. ఆ కథ రాంచరణ్ కి విపరీతంగా నచ్చడంతో పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. అన్ని కుదిరితే లాక్ డౌన్ తర్వాత రాంచరణ్-అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు భావిస్తున్నారు అభిమానులు.
Tags:    

Similar News