వ‌కీల్ సాబ్ ఈవెంట్లో క‌ళ్ల‌న్నీ రాజోలు బ్యూటీపైనే!

Update: 2021-04-05 07:36 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న `వ‌కీల్ సాబ్` వేదిక‌పై ఈ అమ్మ‌డి గురించి ప‌దే ప‌దే జ‌నాల‌ క‌ళ్లు సెర్చ్ చేశాయి. నిమ్మ పసుపు రంగు పారదర్శక చీర .. బూడిద రంగు బ్లౌజ్ ధరించి ఆమె అందం క‌వ్వించిన తీరుకు స్పెల్ బౌండ్ అయిపోయిన యూత్ క‌ళ్ల‌న్నీ అటే.. అంత‌గా అందంతో క‌వ్వించిన ఈ బ్యూటీ ఎవ‌రు? అంటే.. ఇంకెవ‌రు.. అంజ‌లి.

తూ.గో జిల్లా(ఏపీ) రాజోలుకు చెందిన ఈ బ్యూటీ ఆరంభం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో నిరాద‌ర‌ణ‌కు లోన‌య్యారు. తెలుగులో తెలుగ‌మ్మాయిల‌కు చోటివ్వ‌రు క‌దా! దానివ‌ల్ల త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లి అక్క‌డ ప్ర‌తిభ‌ను నిరూపించుకుని వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను సాధించింది. ఆ త‌ర్వాత తెలుగు ప‌రిశ్ర‌మ‌లో పెద్ద అవ‌కాశాలు అందుకుంది. షాపింగ్ మాల్- జ‌ర్నీ చిత్రాల‌తో ప్రూవ్ చేసుకుని అటుపైనా సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు- గీతాంజ‌లి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఎమోష‌న్ ర‌గిలించే పాత్ర‌తో అంజ‌లి క‌ట్టిప‌డేయ‌నుంద‌న్న‌ది ఇన్ సైడ్ టాక్.

ఇక వ‌కీల్ సాబ్ ఈవెంట్లో అంజ‌లి అంద‌చందాలు చీర‌క‌ట్టు మైమ‌రిపించాయి. అలా వేదిక వ‌ద్ద న‌వ్వులు చిందిస్తూ పార ద‌ర్శ‌క‌ చీర‌లో నాభి అందాన్ని ప్ర‌ద‌ర్శించిన తీరుపై యువ‌త‌రంలో చ‌ర్చ కొన‌సాగింది. ఇక మీడియా కెమెరా క‌ళ్లు కూడా అంజ‌లిని అస్స‌లు విడిచిపెట్ట‌కుండా ఫ్లాష్ లు మెరిపించాయంటే అర్థం చేసుకోవాలి. అంజ‌లి నెవ్వ‌ర్ బిఫోర్ ట్రీట్ అంటూ అభిమానులు అదే ప‌నిగా సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.
Tags:    

Similar News