సుశాంత్ మృతిపై మొదటి నుండి అభిమానులు మరియు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కేసును ముంబయి పోలీసులు ఒకలా పాట్నా పోలీసులు మరోలా పరిగణలోకి తీసుకుని ఎంక్వౌరీ చేయడం జరిగింది. ఈ కేసుపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీబీఐ విచారణకు సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సిఫార్సుపై వెంటనే స్పందించిన కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు రెడీ అయ్యింది.
ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం అవుతోంది. మృతికి సంబంధించిన విచారణ లోతుగా జరగాలంటే సీబీఐ రంగంలోకి దిగాల్సిందే అనుకున్న అభిమానులు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా ఇదే కోరుకున్నారు. సుశాంత్ మృతిపై మొదటి నుండి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న ఆయన మాజీ ప్రియురాలు అంకితా లోంఖడే ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం చేసింది.
అంకిత ట్విట్టర్ లో ఈ విషయమై స్పందించింది. మనం దేనికోసం అయితే ఎదురు చూశామో అది నెరవేరబోతుంది. చాలా సంతోషంగా ఉందంటూ ఆమె పేర్కొంది. బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులను ఇప్పటికే ముంబయి పోలీసులు మరియు బీహార్ పోలీసులు కూడా ప్రశ్నించారు. సీబీఐకి ఈ కేసు చేరడంతో మళ్లీ కూడా వారిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఈ కేసు రియా చక్రవర్తి చుట్టు తిరుగుతుంది. ఇప్పటి వరకు ఆమె అండర్ అజ్ఞాతంలోకి వెళ్లి పోయింది. మరి సీబీఐ విచారణకు అయినా ఆమె హాజరు అయ్యేనా చూడాలి.