సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం ''అన్నాతే''. మాస్ డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ నటిస్తున్న ఈ 168వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార - కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కోవిడ్ పరిస్థితుల్లో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుపుకుంటోంది.
'అన్నాతే' షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లో కొన్ని నైట్ సీక్వెన్స్ చిత్రీకరణ చేయాల్సి ఉందట. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించడంతో షూటింగ్ కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్ పోలీసుల నుండి ప్రత్యేక అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ సినిమాకు పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఓ వైపు రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రజనీకాంత్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇంతకముందు కూడా హైదరాబాద్ లో 'అన్నాతే' షూటింగ్ జరుగుతుండగా.. యూనిట్ లో పలువురికి కరోనా రావడంతో షూటింగ్ నిలిపివేశారు. ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాల చిత్రీకరణ నిలిపేస్తూ ఉంటే.. రజినీ మాత్రం ఇంకా షూటింగ్ చేయడం ఎందుకని తమిళ అభిమానులు కలవరపడుతున్నారు. కోవిడ్ టైంలో కూడా షూటింగ్ చేయడం చూస్తుంటే 'అన్నాతే' చిత్రాన్ని ఎలాగైనా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రజినీ నిర్ణయించుకున్నట్లు అర్థం అవుతోంది.