అన్న‌య్య‌ (Vs) త‌మ్ముడు.. బిజినెస్ లో ఎవ‌రు బిగ్ బాస్?

Update: 2021-03-07 05:37 GMT
టాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు అగ్ర హీరో హోదాలో రాజ్య‌మేలారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లాక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ లెగ‌సీని ముందుకు న‌డిపించారు. టాలీవుడ్ ట్రేడ్ లో చిరంజీవి త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక సెన్సేష‌న్. టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణిస్తూనే.. ఆయ‌న మ‌ల్టీట్యాలెంట్ చూపించారు.

అన్న‌య్య త‌మ్ముడు ఇరువురూ రాజ‌కీయాల్లోకి వెళ్లాక ప‌రిస్థితులు మారాయి. చిరు రాజ‌కీయాల్ని విర‌మించి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాలు చేస్తూనే సినిమాల్లో న‌టిస్తున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ బాక్సాఫీస్ రారాజులే. అలాగే బిజినెస్ లో మ్యాసివ్ క‌లెక్ష‌న్స్ తేవ‌డంలో నూ సంచ‌లనాలు సృష్టిస్తారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఆస‌క్తిక‌రంగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ నెల‌రోజుల గ్యాప్ తో రిలీజ‌వుతున్నాయి. ఏప్రిల్ - మే నెల‌ల్ని అన్నయ్య -త‌మ్ముడు రిలీజ్ తేదీల్ని బ్లాక్ చేశారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ ఓపెనింగుల‌తో ఈ రెండు సినిమాలు హాట్ టాపిక్ గా మార‌తాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు. అయితే బిజినెస్ వ‌ర్గాల్లో అన్న‌దన్నల వ్య‌వ‌హారం ఏ రేంజులో ఉంది? అన్న చ‌ర్చా సాగుతోంది. బాస్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య లో రామ్ చ‌ర‌ణ్ అద‌న‌పు హంగు కాబ‌ట్టి ఈ సినిమా బిజినెస్ స్థాయి ఆ లెవ‌ల్లోనే ఉంది. దాదాపు 120 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస చేస్తోంద‌ని స‌మాచారం. అయితే వ‌కీల్ సాబ్ ఒక రీమేక్ సినిమా కావ‌డంతో 75 కోట్ల రేంజులోనే బిజినెస్ సాగుతోంద‌ని ట్రేడ్ వెల్ల‌డిస్తోంది.

ఇక ఆచార్యకు నైజాం పెద్ద ప్ల‌స్. దాదాపు 40 కోట్లకు పైగా బిజినెస్ ఈ ఏరియా నుంచి వ‌చ్చింద‌ని సమాచారం. వకీల్ సాబ్ అందులో సగం రేంజులోనే ఉందిట‌. అయితే ఈ వ‌సూళ్లు తేవ‌డం ప‌వ‌న్ కి క‌ష్ట‌మేమీ కాదు కానీ.. ఆచార్య కు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో అద్భుతం అన్న‌ టాక్ వ‌స్తేనే అంత పెద్ద మొత్తం వ‌సూలు చేయ‌గ‌ల‌ద‌న్న చ‌ర్చా సాగుతోంది. ఓవ‌రాల్ గా అన్న‌ద‌మ్ములు ఆ రెండు నెల‌ల్లో మెగాభిమానుల‌కు ప‌సందైన వినోదాన్ని అందించ‌నుండ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.
Tags:    

Similar News