కరోనా కారణంగా గత ఏడాది చివరి వరకు థియేటర్లు మూత పడే ఉన్నాయి. థియేటర్లు తెరుచుకుని పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత మూడు నెలలుగా థియేటర్లు మూత పడే ఉన్నాయి. థియేటర్లకు ప్రభుత్వాల నుండి గ్రీన్ సిగ్నల్ లభించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. జనాలు థియేటర్లకు రాక పోవడంతో మేకర్స్ సినిమా లను థియేటర్లోల విడుదల చేసేందుకు రావడం లేదు. ఇన్ని రోజులు షూటింగ్ లు పూర్తి చేసి థియేటర్లు ఓపెన్ కోసం వెయిట్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఇంకా వెయిట్ చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడం తప్ప మరేం లేదు అనే ఉద్దేశ్యంతో ఓటీటీ రిలీజ్ కు వెళ్తున్నారు. సౌత్ తో పోల్చితే నార్త్ వారు ఎక్కువగా ఓటీటీకి వెళ్తున్నారు. ఇప్పటికే చాలా సినిమా లను ఓటీటీ ద్వారా హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. మళ్లీ మళ్లీ కూడా హిందీ ప్రేక్షకుల ముందుకు మరిన్ని సినిమా లను తీసుకు వెళ్లే చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం క్రేజీ మూవీ షేర్ షాహ్ సినిమాను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు లో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమా లతో మంచి క్రేజ్ ను దక్కించుకుని బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. సిద్దార్థ మల్హోత్ర హీరోగా నటించిన షేర్ షాహ్ సినిమా ను ఓటీటీ విడుదలకు సిద్దం చేస్తున్నారు.
అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా ను నిన్న థియేటర్ల ద్వారా విడుదల చేసి ఉండాల్సింది. కాని థియేటర్ల పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీకి వెళ్లాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తామని ఇండస్ట్రీ వర్గాల ద్వారా షేర్ షాహ్ మేకర్స్ చెబుతున్నారు. సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీల కాంబోకు మంచి బజ్ ఉంది. అలాగే ట్రెండ్డింగ్ సబ్జెక్ట్ ను ఈ సినిమా కోసం తీసుకున్నారు. కనుక ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంను మొదటి నుండి మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. థియేటర్ లలో విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా మంచి వసూళ్లు వచ్చి ఉండేవి. కాని ఆ పరిస్థితులు లేవు. కనుక ఓటీటీ వైపు అడుగులు పడుతున్నాయి. ఓటీటీ లో ఇప్పటికే విడుదల అయిన కొన్ని హిందీ సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి. కబీర్ సింగ్ తో కియారా కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కనుక ఈ సినిమా ను కియారా అభిమానులు తప్పకుండా ఓటీటీ లో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నారు.