సూపర్ స్టార్‌ తనయుడి మరో ప్రేమ పుకారు

Update: 2023-01-12 09:11 GMT
బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. మొదట్లో ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసు కారణంగా దాదాపు ఏడాది పాటు ఆర్యన్‌ ఖాన్‌ పదే పదే మీడియా కథనాల్లో వచ్చేవాడు.

ఇప్పుడు ఆర్యన్‌ ఖాన్‌ ప్రేమ విషయాలతో వార్తల్లో ఉంటున్నాడు. ఆ మధ్య ఒక న్యూ ఇయర్ పార్టీకి వెళ్లిన సందర్భంగా అక్కడ నోరా ఫతేహీ ఉండటంతో ఇద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది అంటూ ప్రచారం జరిగింది. ఆర్యన్ ఖాన్ మరియు నోరా ఫతేహీ లు కాస్త ఎక్కువ క్లోజ్‌ గానే ఉంటున్నారు అనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలు నిజం కాదని ఆ తర్వాత తేలిపోయింది.

ఇప్పుడు మరో కొత్త పుకారు సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఆర్యన్ ఖాన్‌ మరియు పాకిస్తానీ మోడల్‌ కమ్‌ నటి సాదియా ఖాన్‌ లు ప్రేమలో ఉన్నారని... వీరిద్దరికి సంబంధించిన ఒక ఫొటో వైరల్‌ అవుతోంది. ఈ మధ్య సాదియా ఖాన్‌ గతంలో తీసుకున్న ఒక ఫొటోను షేర్‌ చేసింది.

ఆ ఫొటోలో సాదియా మరియు ఆర్యన్ ఖాన్‌ చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారేమో అన్నట్లుగా అనుమానం కలిగే విధంగా ఆ ఫొటో ఉంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయంలో కూడా నిజం లేకపోవచ్చు అంటూ బాలీవుడ్ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆర్యన్ ఖాన్‌ సినిమా కోసం షారుఖ్ ఖాన్‌ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆర్యన్‌ ను వెండి తెరపై హీరోగా చూడాలి అని కోరుకుంటున్న ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఒక వెబ్‌ సిరీస్ ను తీయబోతున్నట్లుగా ప్రకటించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News