సూప‌ర్ స్టార్ కి అస‌లు సిస‌లు వార‌సుడు?

Update: 2022-11-20 02:30 GMT
సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ర‌ణానంత‌రం ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం స‌హా అభిమానులంతా శోక సంద్రంలోకి వెళ్లిపోయారు. సినీరాజ‌కీయ రంగ ప్ర‌ముఖులంతా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబాన్ని ఓదార్చేందుకు కృష్ణ‌ను సంస్మ‌రించేందుకు వారి ఇంటికి వ‌చ్చి వెళుతున్నారు. సినీప‌రిశ్ర‌మ‌లోను అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ కృష్ణ‌కు ఉన్నారు. వీళ్ల‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఉన్నారు. ఇటీవ‌ల ప‌రామ‌ర్శ‌లో సూపర్ స్టార్ కుటుంబం నుంచి ఒక నూనూగు మీసాల కుర్రాడిని అదే ప‌నిగా ప‌రిశీలించి వెళ్లార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అత‌డు కృష్ణ మ‌న‌వ‌డు అని తెలిసింది.

ఆ కుర్రాడిలో హీరోయిక్ ల‌క్ష‌ణాలు స్ప‌ష్ఠంగా ఉన్నాయి. న‌ట‌శేఖ‌రుని వాసుడిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ తండ్రి లెగ‌సీని స‌మ‌ర్థంగా ముందుకు తీసుకెళుతున్నారు. అసాధార‌ణ‌మైన‌ స్టార్ డ‌మ్ తో మ‌హేష్ దూసుకుపోతున్నాడు. అయితే మ‌న‌వ‌ళ్ల‌లో ఎవ‌రు న‌డిపిస్తారు? అనేందుకు అత‌డు స‌మాధానంగా నిలుస్తాడ‌ని అంతా భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

మ‌హేష్ లా దూసుకెళ్లే డైన‌మిజం ఛామింగ్ లుక్ అత‌డిలో ఉన్నాయ‌ని ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... మ‌హేష్ తో పాటు ఆ యువ‌కుడు కూడా ఓ ఫోటోలో క‌నిపించాడు. ఆ ఫోటోని మ‌హేష్-కృష్ణ సేన‌లు అంత‌ర్జాలంలో వైర‌ల్ చేస్తున్నాయి.

అస‌లింత‌కీ ఎవ‌రా కుర్రాడు? అన్న‌ది ఆరా తీస్తే.. అత‌డు మ‌హేష్ అన్న‌గారు.. దివంగ‌త న‌టుడు కం నిర్మాత అయిన ర‌మేష్ బాబు వార‌సుడు ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ అని తెలిసింది. జ‌య‌కృష్ణ ఆర‌డుగుల అంద‌గాడు. మ‌హేష్ కి స‌రిస‌మాన‌మైన ఎత్తు రంగు లుక్ తో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాడు. అత‌డు హీరో అయితే గ‌నుక చాలా పెద్ద రేంజుకు ఎదుగుతాడ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

ఇప్ప‌టికి ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో జ‌య‌కృష్ణ ఎంట్రీ గురించి మాట్లాడే సంద‌ర్భం కానే కాదు. అయితే అన్న కొడుకుని హీరోగా మ‌రో లెవ‌ల్లో నిల‌బెట్టాల‌న్న ప‌ట్టుద‌ల మ‌హేష్ బాబుకి ఉంద‌ని త‌మ సొంత బ్యాన‌ర్ సినిమాల‌తో మ‌రో గొప్ప హీరోని త‌యారు చేసే బాధ్య‌త‌ను చేప‌డ‌తార‌ని ఇప్ప‌టికే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌హేష్ బాబు త‌న బావ గ‌ల్లా జ‌య‌దేవ్ వార‌సుడు అశోక్ ని హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు స‌హ‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. న‌ట‌వార‌సులు రంగ ప్ర‌వేశం చేసినా ఎవ‌రికి వారు ప్ర‌తిభ‌ను నిరూపించుకుని ఎద‌గాల్సి ఉంటుంది. ప్ర‌వేశం వ‌ర‌కే వార‌స‌త్వం కార్డ్ ఉప‌యోగప‌డుతుంద‌ని ప్రూవ్ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News