నెలకో మంచి సినిమా పడితే చాలనుకునే స్థితిలో ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. సంవత్సరం మొత్తంలో పది హిట్లు చూస్తేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో ఉన్నాం. సినిమాల్లో సక్సెస్ రేట్ అంత దారుణంగా ఉంటోంది మరి. ఏటా వందకు పైగా సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. వాటిలో పది శాతం కూడా సక్సెస్ కావడం లేదు. ఈ ఏడాది ద్వితీయార్ధం మొత్తంలో హిట్ అయినవి.. ప్రేక్షకుల్ని కొంచెం పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించినవంటే నాలుగైదు మాత్రమే. సగటున నెలకో హిట్ కూడా లేదు. ఒక్కోసారి వారంలో నాలుగైదు సినిమాలు రిలీజైతే.. ఒక్కటీ ఆడని పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు వారాల్లో ఇలాగే జరిగింది. వారానికి ఒక సినిమా బాగా ఆడితే చాలనుకుంటాం. అలాంటిది ఈ వారం రిలీజ్ కాబోయే రెండు తెలుగు సినిమాలూ సూపర్ హిట్టయిపోతాయేమో అన్న ఆశ కలుగుతోంది.
ఈ వీకెండ్లో రిలీజయ్యే ‘పడి పడి లేచె మనసు’.. ‘అంతరిక్షం’ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెంటి మీదా పాజిటివ్ బజ్ ఉంది. రెండు టీజర్లూ.. రెండు ట్రైలర్లూ సినిమాలపై అంచనాల్ని పెంచేశాయి. ‘పడి పడి..’ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీలా కనిపిస్తుంటే.. ‘అంతరిక్షం’ ఓ కొత్త అనుభూతిని పంచేలా ఉంది. ఈ చిత్రాల దర్శకులపై ప్రేక్షకులకు మంచి గురి ఉంది. వారి బలాలకు తగ్గ సినిమాలే తీసినట్లున్నారు. రెండు సినిమాల్లోనూ ప్రధాన పాత్రధారులు పెద్ద బలమే. ‘పడి పడి..’లో శర్వానంద్-సాయిపల్లవి జోడీ ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది. ఇక ‘అంతరిక్షం’లో వరుణ్-అదితి-లావణ్య కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవారే. రెండు సినిమాలూ వేటికవే భిన్నమైనవి కావడం వల్ల ఒకదానికి ఒకటి పోటీ అనుకోలేం. బాగుంటే రెండు సినిమాలకూ మంచి ఆదరణ దక్కుతుంది. మరి ప్రేక్షకుల అంచనాలు ఫలించి ఈ వారం డబుల్ ధమాకా వినోదం ఉంటుందేమో చూడాలి.