విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఏ రేంజ్‌లో కుర్రకారుని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ చిత్రంలో గీతగా కనిపించిన రష్మిక మందన్నాకు యూత్ లో యమ క్రేజ్ దక్కింది. ప్రస్తుతం క్రేజీ భామగా యూత్ కు పిచ్చెకిస్తున్న రష్మిక మొదట ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే ఆ చిత్రంతో రష్మికకు పెద్దగా ఫేం రాలేదు. కానీ విజయ్ దేవరకొండతో నటించిన ‘గీతా గోవిందం’ చిత్రంతో చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు యంగ్ హీరోలంతా కూడా రష్మికతో నటించాలని ఆసక్తి చూపుతున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గతంలో గీతా పాత్రకు రష్మిక కంటే ముందు ఇరవై మంది హీరోయిన్లను సంప్రదించినట్టు దర్శకుడు పరుశురామ్ చెప్పుకొచ్చాడు. ఆ ఇరవై మందిలో అను ఇమాన్యూల్ కూడా ఉందట.
గీత పాత్రకు మొదటగా సంప్రదించినది తననే అంటూ ముద్దుగుమ్మ అనూ ఇమాన్యుయెల్ తాజాగా చెప్పుకొచ్చింది. తనకు ‘గీతాగోవిందం’ చిత్రంలో గీత పాత్ర ఆఫర్ వచ్చిన సమయంలో అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటిస్తున్నాను. బన్నీ చిత్రంకు బల్క్ డేట్లు ఇచ్చిన కారణంగా పరుశురామ్ అడిగిన డేట్లను ఇవ్వలేక పోయాను. పాత్ర లేదా హీరో నచ్చక తాను గీత గోవిందం చిత్రాన్ని రిజక్ట్ చేయలేదని, డేట్లు కుదరక పోవడం వల్లే ఆ ఆఫర్ ను వదుకోవాల్సి వచ్చిందని అను చెప్పుకొచ్చింది.
మంచి చిత్రం అనే ఉద్దేశ్యంతో ‘గీత గోవిందం’ చిత్రంలో హీరోయిన్ గా నటించకున్నా కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ లో నటించాను. కనీసం ఆ చిన్న పాత్రలో అయినా నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది. గీత పాత్రను మిస్ అవ్వడం అను ఇమాన్యూల్ కెరీర్ లోనే అతి పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుండగా, కొన్ని చర్చల దశలో ఉన్నారు. తెలుగులో ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఈ ముద్దుగుమ్మ ఎదురు చూస్తోంది.