అను ఇమ్మాన్యుయేల్.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 'స్వప్న సంచారి' అనే మలయాళ చిత్రం ద్వారా బాలనటిగా సినీ కెరీర్ ను ప్రారంభించి, 'యాక్షన్ హీరో బిజు'తో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపుదిద్దుకున్న 'మజ్ను' మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తొలి ప్రయత్నంలోనే ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', గోపీచంద్ సరసన 'ఆక్సిజన్', నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' వంటి చిత్రాలు చేసింది. కానీ, ఏం లాభం.. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
చివరిగా ఆమె 'అల్లుడు అదుర్స్', 'మహా సముద్రం' చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దాంతో అను ఇమ్మాన్యుయేల్ కు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. దర్శకనిర్మాతలెవ్వరూ ఆమెను సరిగ్గా పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం అల్లు శిరీష్ కి జోడిగా 'ప్రేమ కాదంట' అనే చిత్రంలో నటిస్తోంది. లివిన్ రిలేషన్ షిప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ ప్రేమకథ ఇది. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది పైనే గడిచిపోతోంది. ఇంతవరకు కొత్త అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఉందో..లేక ఆగిపోయిందో కూడా తెలియడం లేదు.
ఇక మరోవైపు అను మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'రావణాసుర'లో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఇందులో అనుతో పాటు మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ సైతం హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ లెక్కన రావణాసుర మంచి విజయం సాధించినా అను ఇమ్మాన్యుయేల్ కి ఒరిగేది ఏమీ ఉండదు.
దీంతో అందం, అభినయం, అంతకు మించిన టాలెంట్ ఉన్నా అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితేంటి ఇలా మారిందంటూ అభిమానులు వర్రీ అవుతున్నారు. కానీ, అను మాత్రం అధైర్య పడకుండా అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ విధంగా ఆయినా ఆమెకు ఆఫర్లు వస్తాయో..లేదో..చూడాలి.