కుప్ప‌కూలిన భారీ సామ్రాజ్యానికి న‌ట‌గురువు అండ‌!

Update: 2022-08-31 10:30 GMT
ఐదు ద‌శాబ్ధాల సుదీర్ఘ ప్ర‌స్థానంలో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన బ‌డా బాలీవుడ్ నిర్మాణ సంస్థ YRF ఇటీవ‌ల వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని భారీ చిత్రాల‌పై వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లిన స‌ద‌రు నిర్మాణ సంస్థ వ‌రుస వైఫ‌ల్యాల‌ను ఎదుర్కొంటోంది. దీంతో స‌ద‌రు నిర్మాణ సంస్థ‌పై అంతే పెద్ద స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవలి YRF సినిమాల‌ పరాజయానికి ఆదిత్య చోప్రాను అనురాగ్ కశ్యప్  లాంటి అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ నిందించారు. కానీ ఆ తర్వాత ప్ర‌ముఖ న‌ట‌గురువు.. వెట‌ర‌న్ న‌టుడు అనుపమ్ ఖేర్ యష్ రాజ్ ఫిల్మ్ బ్యాన‌ర్ ని సమర్థించారు. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత సులభం కాదని వైఫ‌ల్యాలు స‌హ‌జ‌మ‌ని అనుప‌మ్ ఖేర్ అన్నారు. నిర్మాత ఆదిత్యా చోప్రాను సమర్థించారు.

ఇటీవలే ది కాశ్మీర్ ఫైల్స్ - కార్తికేయ 2 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో నటించిన అనుపమ్ ఖేర్.. యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాకు మద్దతుగా నిలిచారు. ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇటీవల య‌ష్ రాజ్ సంస్థ సినిమాలు దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు. స‌ద‌రు బ్యాన‌ర్ లో ప్రతి చిన్న విషయానికి తన ఉద్యోగులను ఎలా నిర్దేశిస్తారో అనురాగ్ ప్ర‌స్థావించారు. అయితే య‌ష్ రాజ్ బ్యాన‌ర్ పై నింద‌ల‌ను వ్య‌తిరేకిస్తూ.. అనుపమ్ ఖేర్ YRF లాంటి సామ్రాజ్యాన్ని నిర్మించడం నిర్వహించడం అంత సులభం కాదని సమర్థించారు.

తాజా ఇంట‌ర్వ్యూలో ప్రముఖ నటుడు అనుప‌మ్ ఖేర్ పై విధంగా వ్యాఖ్యానించారు. ''నేను ఆదిత్య చోప్రా గురించి చాలా గర్వపడుతున్నాను. యశ్ జీ కుటుంబం నా సొంత కుటుంబం లాంటిది. యశ్ రాజ్ ఫిల్మ్స్ లాంటి సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత తేలికైన విషయం కాదు. వ్యక్తులు వ్యాఖ్యలు చేయడం సులభం. అతను చెప్పినదానిపై నేను మళ్లీ తీర్పు చెప్పదలచుకోలేదు. అతను మానవ ప్రవర్తనపై అంతిమంగా తీర్పు చెప్ప‌కూడ‌దు.. ఆ అధికారం లేదు'' అని అనుప‌మ్ ఖేర్ అన్నారు.  

యష్ రాజ్ ఫిల్మ్స్ ఇటీవల ఇచ్చిన వరుస ఫ్లాప్ ల గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడిన తర్వాత అనుప‌మ్ ఇలా  వ్యాఖ్యానించ‌డం బాలీవుడ్ లో పెద్ద డిబేట్ గా మారింది. య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన‌ భారీ చిత్రాలైన‌ జయేష్‌భాయ్ జోర్దార్ లో రణవీర్ సింగ్, .. సామ్రాట్ పృథ్వీరాజ్ లో అక్షయ్ కుమార్ .. షంషేరాలో రణబీర్ కపూర్ - సంజయ్ దత్ వంటి సూపర్ స్టార్ లు న‌టించారు. వైఆర్ ఎఫ్‌ చివరి 3 విడుదలలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ డిజాస్టర్ లుగా మారాయి. దీంతో సుమారు 500 కోట్లు పైగా న‌ష్ట‌పోయింద‌ని ప్ర‌చార‌మైంది.

ఈ సమస్యను ప్రస్తావిస్తూ అనురాగ్ బ‌సు నేరుగా నిర్మాత ఆదిత్యా చోప్రాపై బోలెడ‌న్ని  పంచ్ లు విసిరారు. ''మీకు ఒక గుహలో కూర్చొని ఉన్నారు.. బయట ప్రపంచం గురించి తెలియదు. ప్రతి ఒక్కరూ తమ చిత్రాలను ఎలా నిర్మించాలో వారికి ఏమి చేయాలో నిర్దేశిస్తారు. ఆదిత్య చోప్రా కొంత మంది వ్యక్తులను నియమించుకున్నట్లయితే అతను వారికి అధికారం ఇవ్వాలి. వారిని నిర్దేశించకూడదు.. కాస్టింగ్ ను నియంత్రించకూడదు.. ప్రతిదీ నియంత్రించకూడదు. మీ ఆఫీసులో కూర్చోండి.. మీకు నమ్మకం ఉంటే మంచివారిని నియమించుకోండి.. వారినే సినిమా తీయనివ్వండి. కానీ మీరు అలా చేయ‌రు. ఇదే మీరు చేసిన తప్పు! మీరు ఎవ‌రినీ ఉండనివ్వరు'' అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేసారు.

అనుపమ్ ఖేర్ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే- డర్- లమ్హే వంటి కొన్ని అతిపెద్ద YRF చిత్రాలలో భాగమయ్యారు. న‌ట శిక్ష‌కుడిగా అత‌డు య‌ష్ రాజ్ బ్యాన‌ర్ స‌హా ప‌రిశ్ర‌మ అగ్ర బ్యాన‌ర్ల‌లో భాగ‌మయ్యారు. అత‌డు ఏ ఇత‌ర బ్యాన‌ర్ ని కూడా బ్లేమ్ చేయ‌రు.

ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఏమ‌న్నారంటే.. నేను అన్ని అగ్ర బ్యాన‌ర్ల‌కు ప‌ని చేసాను.. ఈ వ్యక్తులందరికీ ప్రియమైన వాడినే అయినప్పటికీ ఆదిత్య - కరణ్ సినిమాల్లో తాను నటించడం మానేశారని చెప్పారు. నేను ఈ రోజు భారతదేశంలోని ప్రధాన స్రవంతి సినిమాలో భాగం కాదు. నేను కరణ్ జోహార్ సినిమాలేవీ చేయడం లేదు. సాజిద్ నదియావాలా సినిమా చేయడం లేదు.. ఆఫర్లు రాకపోవడంతో ఆదిత్య చోప్రా సినిమాలేవీ చేయడం లేదు. నేను వీళ్లందరికీ ప్రియమైనవాడిని.

అందరి సినిమాలూ చేశాను. కానీ నన్ను ఇకపై పిల‌వ‌నందుకు అవ‌కాశాలు ఇవ్వ‌నందుకు వారిని నిందించను''అని అన్నారు. మొత్తానికి అనురాగ్ బ‌సు వర్సెస్ అనుప‌మ్ ఖేర్ ఎపిసోడ్ చాలా పెద్ద విష‌యాల‌ను ప్ర‌పంచానికి ఆవిష్క‌రిస్తున్నాయ‌ని చెప్పాలి. నాణేనికి రెండో వైపు కూడా చూడాల‌నేది అనుప‌మ్ ఉద్ధేశం. కానీ అనురాగ్ క్రియేటివ్ ఫ్రీడ‌మ్ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే య‌ష్ రాజ్ బ్యాన‌ర్ కుప్ప‌కూలుతోంద‌ని విమ‌ర్శించాడు.. అంతే!!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News