ప్ర‌కాష్‌ రాజ్‌ తో అనుపమ గొడ‌వేంటి?

Update: 2018-10-21 10:36 GMT
రామ్ స‌ర‌స‌న వ‌రుస‌గా రెండోసారి న‌టించింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` చిత్రం ఫ్లాపైనా `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` ఫ‌ర్వాలేద‌నిపించింది. ఆ క్ర‌మంలోనే స‌క్సెస్ ప్ర‌మోష‌న్స్‌ లో అనుప‌మ‌కు ఓ చిక్కు ప్ర‌శ్న ఎదురైంది. ప్ర‌కాష్‌ రాజ్ గారితో మీరు ఆన్ లొకేష‌న్ గొడ‌వ ప‌డ్డార‌ట క‌దా? అన్న ప్ర‌శ్న‌కు అనుప‌మ చాలానే డీటెయిలింగ్ ఇచ్చింది.

అలుప‌న్న‌దే ఎరుగ‌క‌ షూటింగ్ చేశాక నేను ఓసారి అనారోగ్యం పాలై హాస్పిట‌ల్‌ కి వెళ్లొచ్చాను. వ‌చ్చిన మ‌రుస‌టి రోజు అనుకుంటా ఇలాంటి వార్త‌లు వ‌చ్చాయి. అరే ఇదేంటి? ఇలా ప్ర‌చార‌మ‌వుతోంది అని అనుకున్నా. అస్స‌లు ఆయ‌న‌కు దీంతో ఏ సంబంధ‌మూ లేదు పాపం..! అనేసింది. ప్ర‌కాష్‌ రాజ్ గారితో నేను రెండోసారి ప‌నిచేస్తున్నా. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంలో ఆయ‌న తాత‌గారు. హ‌లో గురూ చిత్రంలో తండ్రి పాత్ర‌లో న‌టించారు. నెక్స్ట్ బోయ్ ఫ్రెండ్‌ గా చేస్తారేమో.. అంటూ న‌వ్వేసింది. హ‌లో గురూ ప్రేమ‌కోస‌మేలో నాకు తొలి నుంచీ ప్ర‌కాష్‌ రాజ్‌ గారి పాత్ర ఇష్టం. రామ్ పాత్ర తో.. ఆ ఇద్ద‌రితో అను అనే పాత్ర ఎంత‌లా క‌నెక్ట్ అయింద‌నేది ఆస‌క్తిక‌రం. ప్ర‌కాష్‌ రాజ్‌ గారి నుంచి మ‌నం ఎంతైనా నేర్చుకోవచ్చు. అని చెప్పింది.

రియ‌ల్ లైఫ్‌ లో మీ ఫాద‌ర్‌ కీ - ప్ర‌కాష్‌ రాజ్‌ కి వ్య‌త్యాసమేంటి? అని ప్ర‌శ్నిస్తే.. ఇలాంటి స‌న్నివేశంలో మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియ‌దు. కానీ స్క్రీన్ మీద ఫాద‌ర్ ఓపెన్ మైండెడ్‌ - బ్రాడ్ మైండెడ్‌.. అంటూ చెప్పుకొచ్చింది. అస‌లే ప్ర‌కాష్‌ రాజ్ ఆన్ లొకేష‌న్ అంద‌రితో గొడ‌వ ప‌డ‌తార‌ని ప‌లు మార్లు ప్రూవైంది. ఆ క్ర‌మంలోనే ఇలాంటి చిక్కు ప్ర‌శ్న ఎదుర‌వ్వ‌డంతో అనూ  కాస్త త‌డిపొడిగానే పైవిధంగా స‌మాధానం చెప్ప‌డం చ‌ర్చ‌కొచ్చింది.


Tags:    

Similar News