ప‌వ‌న్‌ ని మ‌ల‌యాళంకి ర‌మ్మంది

Update: 2016-05-03 04:38 GMT
రావ‌ణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్లాయ‌న్ని ప‌వ‌న్‌ కళ్యాణే అనుకుంటుందంటూ అద‌ర‌గొడుతోంది అమ్మోరు క‌త్తి. ఇంకా అర్థం కాలేదా? అయితే మీరు అర్జంటుగా అఆ ట్రైల‌ర్ చూసేయండి. `ప్రేమ‌మ్‌`లో రింగుల జుత్తుతో క‌నిపించిన అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగు సినిమాల్లోకి వ‌స్తోంద‌న‌గానే ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తోందో అంటూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూశారు సినీ జ‌నాలు.

అఆలో ఆమెని త్రివిక్ర‌మ్ అమ్మోరు క‌త్తిగా చూపించేశాడు. సినిమాకి ఓ మాంచి ట్విస్టునిచ్చే పాత్ర‌లో ఆమె క‌నిపించబోతోంద‌ని ట్రైల‌ర్‌ నిబ‌ట్టి చూస్తే అర్థమ‌వుతోంది. మ‌ల‌యాళం ప్రేమ‌మ్‌ లో అనుప‌మ‌కీ - అఆలో అనుప‌మ‌కీ చాలా తేడాలు క‌నిపిస్తున్నాయి. ఇందులో మ‌రింత అందంగా క‌నిపిస్తోందామె. నిన్న జ‌రిగిన ఆడియో వేడుక‌కి కూడా అందంగా ముస్తాబై వచ్చింది. వేడుక‌లో  ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ని చూసి ముచ్చ‌ట‌ప‌డిపోయింది. ఆపుకోలేక ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ని వుద్దేశించి మిమ్మ‌ల్ని మ‌ల‌యాళం సినిమాల్లో చూడాల‌ని వుంది సార్‌, వ‌చ్చేయండి అని ఆహ్వానించింది.

మ‌ల‌యాళంలో చెప్పిన ఆ మాట‌ల్ని యాంక‌ర్ సుమ తెలుగులో చెప్పేస‌రికి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పెద్ద‌యెత్తున న‌వ్వేశాడు. అంత‌టితో ఆగ‌కుండా సుమ... మ‌ల‌యాళం సినిమాల్లో న‌టిస్తే ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఎలా వుంటాడో ఊహిస్తూ స్టేజీపైన చెప్పేసింది. పంచ‌క‌ట్టుతో - అడ్డం బొట్టుతో ప‌వ‌న్‌ ని ఊహించుకొంటుంటే చాలా బావుంది అనేస‌రికి ప‌వ‌న్ మ‌రింత‌గా న‌వ్వేశాడు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఎక్కువ‌గా పంచెల్లోనే క‌నిపిస్తున్నాడు కాబ‌ట్టి ఆయ‌న మ‌ల‌యాళం సినిమాల‌కి బాగానే సెట్ట‌వుతాడనిపిస్తోంది. ప్రేమ‌మ్‌ పోరి ప్రేమ‌గా పిలిచింది కాబ‌ట్టి ప‌వ‌న్ ఆలోచిస్తే బాగానే వుంటుంది మ‌రి!
Tags:    

Similar News