కార్తికేయ 2 కోసం ఆ హీరోయిన్?

Update: 2019-12-18 12:30 GMT
వాయిదాలు పడినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర 'అర్జున్ సురవరం' విజయం సాధించడంతో యవహీరో నిఖిల్ సిద్ధార్థ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఉత్సాహంలో మంచి ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు.  ఇప్పటికే జీఎ2 పిక్చర్స్- సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించే ఒక సినిమా లాంచ్ అయింది.  ఈ సినిమా కాకుండా మరో సినిమా కూడా లైన్ లో ఉంది.

చందూ మొండేటి - నిఖిల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కార్తికేయ' కు సీక్వెల్ గా 'కార్తికేయ 2' తెరకెక్కనుంది.   ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని సమాచారం.  ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ పేరును పరిశీలిస్తున్నారట.  అనుపమ కెరీర్ మొదట్లో జోరుగా సాగింది.  వరస హిట్లతో దూసుకుపోయింది. కానీ ఈమధ్య మాత్రం హిట్లు లేక అవకాశాలు తగ్గాయి.  ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తోంది.  అయితే 'కార్తికేయ 2' లో పాత్ర అనుపమకు చక్కగా సూట్ అవుతుందనే ఉద్దేశంతో చందూ మొండేటి ఉన్నాడట.  ప్రస్తుతం అనుపమతో చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే హీరోయిన్ విషయం క్లారిటీ వస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో స్వాతి రెడ్డి(కలర్స్ స్వాతి) నటిస్తుందని సమాచారం. ఒరిజినల్ లో స్వాతి హీరోయిన్ గా నటించింది. అందుకే సెంటిమెంట్ గా సీక్వెల్ లో కూడా స్వాతి కోసం ఒక స్పెషల్ రోల్ ప్లాన్ చేశారట. ఇదంతా చూస్తుంటే 'కార్తికేయ 2' ప్రాజెక్ట్ క్రేజీగా మారేలా ఉంది కదా?


Tags:    

Similar News