పేరుకి వరదలు కేరళకు వచ్చాయి కానీ వాటి ప్రభావం తెలుగు సినిమాల మీద కూడా గట్టిగా పడింది. శైలజారెడ్డి అల్లుడు ఈ కారణంగానే రీ రికార్డింగ్ పూర్తి చేసుకోలేక ఏకంగా రెండు వారాల దాకా వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఇదొక్కటే కాదు మలయాళీ హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న ఇతర బాషా సినిమాలకు సైతం ఇబ్బంది ఉంది. అందుకే తనవల్ల షూటింగ్ ఆలస్యం కాకుండా రిస్క్ తీసుకున్న అనుపమ పరమేశ్వరన్ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం తను దిల్ రాజు నిర్మాణంలో త్రినాథరావు దర్శకత్వంలో రామ్ హీరోగా హలో గురు ప్రేమ కోసమేలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వర్షం కేరళను ముంచెత్తిన సంగతి తెలియగానే అక్కడికి వెళ్లిన అనుపమ కొద్ది రోజులు వాళ్లకు అండగా నిలిచింది. ఈలోపు హలో గురు ప్రేమ కోసమే షూటింగ్ డేట్ దగ్గర పడటంతో ఇక్కడికి బయలుదేరి వచ్చేసింది.
క్యాలికట్ ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్ మార్గం ద్వారా ఇంకా పూర్తిగా సరికాని రహదారుల మీదే రిస్క్ తీసుకుని మరీ ఇక్కడ ప్రత్యక్షం కావడంతో యూనిట్ షాకయ్యిందట. అనుపమ కేరళకు వెళ్లినప్పుడే రాదేమో అని అనుమనించిన వాళ్లకు చెక్ పెడుతూ డెడికేషన్ అంటే ఏమిటో చూపించేస్తోంది. హలో గురు ప్రేమ కోసమే దసరా విడుదలకు ప్లాన్ చేశారు. అక్టోబర్ 18ని టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ వేగవంతం చేసారు. అనుపమ కేరళ వెళ్లడం వల్ల బ్రేక్ తప్పదేమో అనుకుంటే ఇలా తిరిగి రావడం పట్ల టీమ్ యమా ఖుషిగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఇంకో పాతిక శాతం బాలన్స్ ఉన్నట్టు వినికిడి. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నేను లోకల్ తర్వాత త్రినాథరావు చేస్తున్నది కావడంతో ఆ రకంగా కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. రామ్ గత చిత్రం ఉన్నది ఒకటే జిందగిలో కూడా అనుపమనే హీరోయిన్. అది ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికి దీని మీద చాలా నమ్మకంగా ఉన్నారు ఇద్దరు. ఏదైతేనేం అనుపమ చేసిన పని మరొకరికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.