పద్మావతి వివాదం కామెడీగా ఉంది

Update: 2017-12-16 18:30 GMT
బాలీవుడ్ లో ఈ ఇయర్ బిగెస్ట్ ఫిల్మ్ గా రిలీజ్ కావాల్సిన పద్మావతి సినిమా ఇక రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. డిసెంబర్ 1వ తేదీనే సినిమా విడుదల కావాల్సింది. కానీ మేము దైవంలా కొలిచే పద్మావతి జీవిత చరిత్రను తప్పుగా చూపిస్తున్నారు అంటూ.. కర్ణసేన సంఘం అలాగే కొన్ని హిందు సంఘాలతో పాటు బీజేపీ నాయకులు కూడా తప్పుబట్టారు. సినిమా విడుదలైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరికలను జారీ చేశారు. అంతే కాకుండా పద్మావతి పాత్రలో నటించిన దీపిక పదుకొనె తలను నరికేసిన వారికి నజరానా ఇస్తామంటు కొందరు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే దర్శకుడు పై కూడా ఫైర్ అయ్యారు. షూటింగ్ దశలో అతనిపై చేయి కూడా చేసుకున్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ అయితే క్యాన్సిల్ అయ్యింది గాని మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మాత్రం చిత్ర యూనిట్ చెప్పడం లేదు. దీంతో సినిమా రిలీజ్ అయ్యేది కష్టమే అన్న విధంగా వార్తలు వెలువాడుతున్నాయి. కానీ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు మాత్రం సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటని అంటున్నాడు. ఎందుకంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా నా లాంటి వాళ్లు తప్పుకుండా సినిమాను చూస్తారు అంటూ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పద్మావతి వివాదం గురించి స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. నిజంగా ఇది నవ్వుతో పాటు చిరాకు తెప్పించే పరిణామం. ఒక దర్శకుడుపై దాడి చేయడం మొదటి సారి చూస్తున్నా. ఒక సినిమాను చూడకముందే..వాళ్లు అలా ప్రవర్తించడం ఏమిటి. అసలు వాళ్లకి నిజమైన పద్మావతి కథ తెలుసా ? అనేది నా డౌట్. నిజంగా ఇది చాలా కామెడీ గా ఉంది. ఎందుకంటే అనుకోని విధంగా వారు ఇష్టం వచ్చినట్లు ఉహించుకుంటున్నారు.  ఆ విధమైన ఆలోచనతో ఎలా వివాదాలను సృష్టిస్తున్నారో అని అనురాగ్ వివరించారు.
Tags:    

Similar News