బీచ్ లో అనుష్క అలా చేసేసింది

Update: 2017-09-29 19:16 GMT
చూస్తుంటే.. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం సక్సెస్ అయ్యాయేట్టుగానే ఉంది. ఎంతో నమ్మకంతో ప్రధానమంత్రి మోడీ తలపెట్టిన ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా సెలబ్రెటీలు ఉత్తేజపరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి పిలుపును ఇస్తూనే.. రోడ్లెక్కి ఎలా శుభ్రం చేసుకోవాలో ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి వినతి మేరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా తన బాధ్యతను నిర్వర్తించింది.

చాలా వరకు స్టార్స్ సోషల్ మీడియా ద్వారా పిలుపును ఇస్తుండగా.. అనుష్క మాత్రం  ముంబయిలోని వెర్సోవా బీచ్‌ను శుభ్రం చేశారు. గురువారం  స్వచ్ఛ భారత్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ‘స్వచ్ఛతే సేవా’ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. అందుకు సంబందించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మంచి సందేశాన్ని ఇచ్చింది. ‘దేశం అమ్మలాంటిది. అలాంటి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ప్రతిరోజు  మన కోసం ఎదో ఒక పని చేస్తాం. దానితో పాటు పరిశుభ్రమైన సమాజం కోసం జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యమన్న అనే విషయం అందరికి  తెలిసిందే. ఈరోజు నేను వర్సోవా బీచ్‌కి వెళ్లి నా వంతు సాయం చేశాను. బీచ్‌ శుభ్రం చేస్తున్నప్పుడు నాకు చేప్పలేనంత ఆనందం కలిగింది. మహాత్మా గాంధీ శైలిలో చెప్పాలంటే టన్నుల కొద్దీ ప్రసంగాలు ఇవ్వడం కంటే మనకు నచ్చిన పనిని చెయడం చాలా మంచిది' అని అనుష్క వివరణ ఇచ్చింది.

ఇక ప్రభాస్ - రజినీకాంత్ కూడా సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛ భారత్' లో పాల్గొనాలని అభిమానులకు  పిలుపునిచ్చారు. ప్రముఖులందరు ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా చెయ్యాలని మోడీ లేఖ ద్వారా తెలిపారు. లేఖ అందుకున్న వారిలో  మోహన్‌లాల్‌ -  దర్శకుడు రాజమౌళి అలాగే మహేశ్‌బాబు మరియు  మోహన్‌బాబు కూడా ఉన్నారు.
Tags:    

Similar News