2021 స్పెష‌ల్‌: మ‌మ్మీ డాడీ అవ్వ‌డ‌మే కొత్త సంవ‌త్స‌ర కానుక‌

Update: 2021-01-03 02:30 GMT
2020 ముగించి 2021లో అడుగుపెట్టాం. వేన‌వేల ఆశ‌ల‌తో అభివృద్ధి వైపు సాగిపోవాల‌న్న‌దే అంద‌రి ఆలోచ‌న‌. మ‌హ‌మ్మారీ వెత‌ల‌కు చెక్ పెట్టే దిశ‌గా ముంద‌డుగు ప‌డుతుంటే ఆశావ‌హధృక్ప‌థం క‌నిపిస్తోంది. అదంతా స‌రే కానీ.. 2020లో అమ్మా నాన్న కాబోయే స్టార్ సెల‌బ్రిటీల‌కు సంబంధించిన క‌థ‌నాలు ఆద్యంతం అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి. 2021లో పేరెంట్ హుడ్ కి సిద్ధ‌మ‌వుతున్న ఏడు జంట‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ.. కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ - 2021 లో పేరెంట్ ‌హుడ్ ‌ను స్వీకరించే 7 జంటల్లో ఉన్నారు. వీరితో పాటు అమృత రావు.. అహానా డియోల్.. పూజా బెనర్జీ  కిడ్స్ ని స్వాగతించిన జంట‌ల్లో ఉన్నారు.

అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ

దుబాయ్ లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ‌కు విరాట్ కోహ్లీ బయలుదేరడానికి ముందే విరుష్క జంట ఎంతో ఆనందంగా ఈ ప్రకటన చేశారు. అనుష్క - విరాట్ ఈ నెలలో తమ బిడ్డను ఆశిస్తున్నారు. అభిమానుల‌కు కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా జూనియ‌ర్ విరాట్ లేదా అనుష్‌క ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇది ఒక సంబ‌రం లాంటిదే.

కరీనా కపూర్ ఖాన్-సైఫ్ అలీ ఖాన్

కరీనా కపూర్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్ 2020 ఆగస్టులో త‌మ రెండో బిడ్డ ఆగ‌మ‌నం గురించి ప్ర‌క‌టించారు. కరీనా కపూర్ ఖాన్ పసుపు రంగు సూట్ ‌ని ధ‌రించి రక్షాబంధన్ జరుపుకున్న తర్వాత గర్భం విష‌యాన్ని ప్రకటించారు. కరీనా - సైఫ్ ఆరోజు ఈ అద్భుత విష‌యాన్ని బహిరంగ ప్రకటన చేశారు. తైమూర్ అలీ ఖాన్ ఫిబ్రవరిలో లేదా మార్చి మొదట్లో ఒక బుల్లి సోదరుడు లేదా సోదరిని క‌లిగి ఉండొచ్చు.

అనితా హసానందాని-రోహిత్ రెడ్డి

అనిత హసానందాని.. రోహిత్ రెడ్డి జంట అక్టోబ‌ర్ లో ఆ విష‌యాన్ని ధృవీక‌రించారు. త‌మ సొంత‌ వీడియో మేకర్  యాప్ ను ప్రారంభించిన సంద‌ర్భంలో అధికారికంగా గర్భధార‌ణ‌ విష‌యాన్ని ప్రకటించారు. ఇది ఒక అందమైన ప్రకటన. ఆ వీడియో అంత‌ర్జాంలో జోరుగా వైరల్ అయ్యింది. అభిమానుల నుంచి చాలా ప్రేమను సంపాదించింది. అనిత- రోహిత్ 2021 ఫిబ్రవరిలో తమ బిడ్డను ఆశిస్తున్నారు.

సాగరికా ఘాట్గే-జహీర్ ఖాన్

ఈ జంట‌ గర్భం గురించి అధికారికంగా ప్రకటించక‌పోయినా.. సాగరికా ఘాట్గే - జహీర్ ఇక్బాల్ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముంబై ఇండియన్స్ బృందం జహీర్ పుట్టినరోజు జరుపుకున్న ఒక వీడియో వైరల్ అయ్యింది. లవ్ బర్డ్స్ కి అత్యంత‌ సన్నిహితుడు ముంబై మిర్రర్ కి ఈ వార్తను ధృవీకరించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

జాంకీ పరేఖ్-నకుల్ మెహతా

జాంకీ పరేఖ్ - నకుల్ మెహతా కూడా మొదటిసారి తల్లిదండ్రులు కానున్నారు. వారు ఈ వార్తను 2020 నవంబర్ ‌లో ప్రకటించారు. శిశువు ఫిబ్రవరిలో జ‌న్మించ‌నుంద‌ని స‌మాచారం. ఫిబ్రవరిలో చాలా మంది త‌మ సంతానంతో మ‌మ్మీ డాడీలుగా మారుతుండ‌డం ఆస‌క్తిక‌రం.

నేహా మిశ్రా-నామన్ షా

టెలివిజన్ నటుడు నామన్ షా- నేహా మిశ్రా జంట తమ‌ మొదటి బిడ్డను  ఆశిస్తున్నారు. శిశువు గడువు తేదీ ఇంకా తెలియదు. 2021 లో నామన్ - నేహా తమ బిడ్డను స్వాగతిస్తారన్న‌ది క‌న్ఫామ్.

అదితి శిర్వైకర్-మోహిత్ మాలిక్

అదితి శిర్వైకర్ - మోహిత్ మాలిక్ ఒక దశాబ్దం క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంట ఇప్ప‌టికి తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. శిశువు 2021 మేలో జ‌న్మించ‌నుంది.

ఇక కోలీవుడ్ స‌ర్కిల్స్ నుంచి క‌మెడియ‌న్ యోగిబాబు దంప‌తులు గ‌త ఏడాది వివాహం చేసుకోగా త‌మ తొలి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. టాలీవుడ్ నుంచి ప‌లువ‌రు స్టార్ క‌పుల్ త‌మ తొలి సంతానం రాక కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.


Tags:    

Similar News