వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ కి అనుమ‌తుల నిరాక‌ర‌ణ‌

Update: 2023-01-04 17:38 GMT
సంక్రాంతి పందెంలో రెండు భారీ చిత్రాలు దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి-వాల్తేరు వీర‌య్య .. బాల‌కృష్ణ‌- వీర‌సింహారెడ్డి! న‌డుమ బాక్సాఫీస్ హోరాహోరీ గురించి అభిమానుల్లో చర్చ వేడెక్కిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల ప్రీరిలీజ్ వేడుక‌ల‌కు ఏర్పాట్లు సాగుతుండ‌గా వేలాదిగా అభిమానుల రాక‌తో క్రౌడ్ మ్యానేజ్ మెంట్ స‌మ‌స్యాత్మ‌కం కానుంద‌ని పోలీసుల నుంచి అనుమ‌తులు ల‌భించ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతోంద‌ని చెబుతున్నారు.

ఈనెల‌ 6న ఒంగోలు- ఏబీఎం గ్రౌండ్స్ లో జరగాల్సిన నందమూరి బాలకృష్ణ `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతులు నిరాకరించారు. దీనికి ఇటీవ‌లి దుర్ఘ‌ట‌న కార‌ణంగా చెబుతున్నారు.

మొన్న‌టికి మొన్న‌ ఓ భారీ కార్య‌క్ర‌మంలో తొక్కిసలాటతో అమాయకుల మరణాలు కూడా పోలీసు శాఖ లేవనెత్తిన ప్ర‌శ్న‌. ఒంగోలులో భారీ స‌భ‌ల‌తో శాంతిభద్రతల స‌మ‌స్య త‌లెత్త‌కుండా పోలీసులు అనుమ‌తులు మంజూరు చేయ‌డంలేద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రీరిలీజ్ వేడుకకు సంబంధించిన‌ వెన్యూపై ఇప్పుడు అస్ప‌ష్ఠత నెల‌కొంది.

తాజా ప‌రిణామంతో వెన్యూని ఏపీ నుంచి హైద‌రాబాద్ కి మారుస్తార‌ని ఊహిస్తున్నారు. ఒంగోలు నేప‌థ్యంలో క‌థాంశం కాబ‌ట్టి వీర‌సింహారెడ్డి ఈవెంట్ ని ఒంగోలులో నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కానీ ఈ వేడుక‌కు ఆటంకం త‌ప్ప‌లేదు. భారీ ఈవెంట్ ని గ్రాండ్ స‌క్సెస్ చేసేందుకు మేకర్స్ ఇప్పుడు వేరొక‌ వేదిక కోసం చూస్తున్నారని స‌మాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

అయితే బాల‌కృష్ణ సినిమా వీర‌సింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుక‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీర‌య్య` ప్రీరిలీజ్ వేడుక‌కు భారీగా అభిమానులు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్నందున ఏపీ పోలీసులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. క్రౌడ్ మ్యానేజ్ మెంట్ స‌మ‌స్యాత్మ‌కం కానున్నందున‌ పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని స‌మాచారం. చిరంజీవి - బాల‌కృష్ణ సినిమాలు సంక్రాంతి బ‌రిలో నువ్వా నేనా? అంటూ హోరాహోరీగా బాక్సాఫీస్ పోరుకు దిగుతున్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News