ఆదివారం 'సోలో'గా కుమ్మేశాడే కుర్రాడు

Update: 2017-01-01 18:02 GMT
బహుశా 'సోలో' సినిమా తరువాత కమర్షియల్ హిట్ అనేది కాస్త దూరంగా ఉన్నా కూడా.. ఇప్పుడు మాత్రం టాలెంటెడ్ హీరో నారా రోహిత్ కు కావల్సిన హిట్టు దొరికేసింది. అప్పట్లో ఒకడుండేవాడు అంటూ వచ్చిన నారావారబ్బాయి.. ధియేటర్ల దగ్గర తాను ఏ రేంజులో ఉన్నాడో నిరూపించుకుంటున్నాడు.

సాగర్ చంద్ర డైరక్షన్లో రూపొందిన ఒక నైంటీస్ బ్యాక్ డ్రాప్ మూవీ ''అప్పట్లో ఒకడుండేవాడు''. ఒక క్రికెటర్ జీవితంలో తిరిగిన మలుపులు.. ఒక పోలీస్ ఇనస్పెక్టర్ తాలూకు తెగువ.. కొన్ని సంఘటనలు.. చెదిరిన జీవితాలు.. మారిపోయిన గమ్యాలు.. వెరసి వెండితెరపై అద్భుతంగా పండేశాయి. అయితే ఈ సినిమాకు సింగిల్ స్ర్కీన్స్ విషయంలో ప్రెజన్స్ బాగా తక్కువగానే ఉన్నప్పటికీ.. మల్టీప్లెక్సుల్లో మాత్రం కాస్త ఎక్కువ షోలే దొరికాయి. దానికితోడు శుక్రవారం సాయంత్రానికి బ్రహ్మాండమైన టాక్ రావడంతో శనివారం కలక్షన్లు అదిరిపోతే.. శనివారం వచ్చిన టాక్ తో.. న్యూ ఇయర్ జోష్ లో ఉన్న తెలుగు ప్రజానీకం ఆదివారం ఈ  సినిమాకే పట్టంకట్టేశారని డిస్ర్టిబ్యూటర్ వర్గాలు చెబుతున్నారు.

ఒకవేళ మరిన్ని స్ర్కీన్స్ పడితే ఇంకా బాగుంటుంది కాని.. పడకపోయినా కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చే వరకు సోలోగా ధియేటర్లలో దండుకోవచ్చు నారా రోహిత్ అండ్ శ్రీవిష్ణు. ఈ ఆదివారం ఎఫెక్ట్ తో లోకల్ బయ్యర్లు కూడా ఈ సినిమా కోసం కాల్స్ చేస్తున్నారట. ఆ లెక్కన చూస్తే రానున్న రోజుల్లో ఈ ఒకడు పండగ చేసుకునేలా ఉన్నాడు.
Tags:    

Similar News