తమిళనాడులో జల్లికట్టు వ్యవహారం సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ విషయంపై దాదాపు తమిళనాడంతా ఒక్కతాటిపైకి వచ్చారని కొందరంటుంటే... ఇది ఏమాత్రం మంచి సంప్రదాయం కాదని, మూగజీవాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి సరైంది కాదని మరోవర్గం ఆరోపిస్తుంది. అలా జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన సెలబ్రెటీలకు ఇప్పటికే శవయాత్రలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు జల్లికట్టు అనుకూల జనాలు. ఈ సందర్భంలో జల్లికట్టు వ్యవహారంపై తాజాగా ఏ ఆర్ రహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ జల్లికట్టుకు అనుకూలంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుకూల ప్రదర్శనలు ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతుండటం, చాలా మంది సెలబ్రెటీలు ఆ అనుకూల ప్రదర్శనలకు మద్దతివ్వడం జరుగుతూనే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఈ పంచాయితీని మోడీ ముందు పెట్టిన సంగతీ తెలిసిందే. ఇదే క్రమంలో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న తమిళ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తూ రేపు (20-01-2017 శుక్రవారం) ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని రహమాన్ నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయంపై తమిళనాడు యువత మొత్తం రోడ్లపైకి, మెరీనా బీచ్ కి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్న సందర్భంలో తాజాగా రహమాన్ కూడా ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/