మంచు విష్ణు- కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన మోసగాళ్లు త్వరలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విష్ణు అండ్ టీమ్ ఈ సినిమా ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇటీవలే 10 నిమిషాల స్నీక్ పీక్ వీడియోను మీడియా కోసం ప్రదర్శించగా దానికి అద్భుత స్పందన వచ్చింది.
ఒక భారీ స్కామ్ నేపథ్యంలో కథాంశాన్ని రివీల్ చేస్తూ ఆ వీడియో రక్తి కట్టించింది. 2600 కోట్ల కుంభకోణంలో పాల్గొన్న పాత్రల్ని ఈ వీడియోలో చూపించారు. ఎంచుకున్న కథాంశం బ్యాక్ గ్రౌండ్ అద్భుతంగా ఉందని యూనివర్శల్ అప్పీల్ తో ఉందన్న టాక్ కూడా వినిపించింది. థియేటర్లలో చూడాలన్నంత క్యూరియాసిటీని తాజా వీడియో ఇచ్చింది.
ఇంటర్‌పోల్ .. స్థానిక పోలీసుల మధ్య మైండ్ గేమ్ ఆడుతూ మోసగాళ్ల బృందం ఏం చేసిందన్నది ఆసక్తికరం. కుర్చీ అంచుపై కూచుని చూసేంతగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మూవీ సాగనుంది. కాజల్ ఇందులో విష్ణుకి అక్క పాత్రలో నటించారు. ఆ ఇద్దరూ సముచిత నటనతో ఆకట్టుకున్నారు.
మోసగాళ్లు కొత్త తరహా కథతో వస్తోందని... కాపీ అన్నదే లేని ఒరిజినల్ కథ ఇదని టీమ్ చెబుతోంది. ఆకర్షణీయమైన కథనంతో పాటు గొప్ప సాంకేతిక విలువలతోనూ మైమరిపించనుందని వెల్లడిస్తున్నారు. కేవలం 10 నిమిషాల వీడియో అటువంటి ప్రభావాన్ని చూపగలిగినప్పుడు ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి ప్రభావం సృష్టించబోతోందో అంచనా వేయొచ్చన్న ధీమాను వ్యక్తం చేస్తోంది మోసగాళ్లు టీమ్.
నిజ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిదని విష్ణు మంచు తొలి నుంచి చెబుతున్నారు. ఈ చిత్రంలో తాము పోషించిన పాత్ర(ధారు)లు రియల్ లైఫ్ లో ఉన్నారు. ప్రస్తుతం వారంతా ముంబైలో ఉంటున్నారని వెల్లడించారు. పోలీసు అధికారి కూడా ముంబైలో ఉంటున్నారు. నేను పేర్లను వెల్లడిస్తే వారు నాపై కేసు పెట్టవచ్చు అని విష్ణు పేర్కొన్నాడు.
కుంభకోణానికి నాయకత్వం వహించే వ్యక్తి కాజల్. కానీ ఆ సంగతిని బయటికి చెప్పొద్దని చాలామంది అంటున్నారు. కానీ మేం ప్రజలను మోసం చేయాలనుకోలేదు. కేవలం ప్రేక్షకులను సిద్ధం చేయాలనుకుంటున్నాము అని విష్ణు అన్నారు.