#2020 స్పెష‌ల్: ప‌్ర‌భాస్ తో 'అర్జున్ రెడ్డి' డైరెక్ట‌ర్

Update: 2019-12-23 04:36 GMT
`బాహుబ‌లి` ఫ్రాంఛైజీ తో డార్లింగ్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా  ఎదిగారు. అటుపై కేవ‌లం పాన్ ఇండియా సినిమాల్నే చేయాల్సిన స‌న్నివేశం ఎదురైంది. `సాహో`తో బాహుబ‌లి ఫీట్ ని రిపీట్ చేయాల‌ని ప్లాన్ చేసినా ఆశించిన ఫ‌లితం రాలేదు. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా మ‌రో పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌భాస్ లైన్ లో పెడుతుండ‌డం ఆస‌క్తి ని రేకెత్తిస్తోంది. `అర్జున్‌ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వం లో ప్ర‌భాస్ ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేక‌ర్స్‌ తో క‌లిసి ప్ర‌ఖ్యాత బాలీవుడ్ దిగ్గ‌జ సంస్థ‌ టీ సిరీస్ నిర్మించ‌డానికి స‌న్నాహాల్లో వున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్‌.

`అర్జున్ రెడ్డి` రీమేక్  `క‌బీర్ సింగ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం తో సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా వెలిగి పోతున్నారు. టి సిరీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించి దాదాపు 300 కోట్ల‌ కు పైగా వ‌సూళ్ల‌ ని రాబ‌ట్టింది. ఆల్ టైమ్ టాప్ 10 హిట్స్ జాబితా లో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగ‌ తో మ‌రో సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న టీ సిరీస్.. ప్ర‌భాస్ హీరో గా మ‌రో భారీ చిత్రానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సందీప్ వంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌భాస్- సందీప్ వంగా కాంబినేష‌న్ లో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని నిర్మించేందు కు ప్లాన్ రెడీ అయి పోయింది.

టీ సిరీస్- మైత్రి సంస్థ జాయింట్ వెంచ‌ర్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మార‌నుంది. ప్రస్తుతం ప్ర‌భాస్ `జాన్‌` చిత్రం లో న‌టిస్తున్నారు. యువి క్రియేష‌న్స్- గోపికృష్ణ మూవీస్ జాయింట్ వెంచ‌ర్ ఇది. పీరియాడిక్ ల‌వ్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయి లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం పూర్త‌యిన త‌రువాత ప్ర‌భాస్ 21 సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం లో ప‌ట్టాలెక్కే వీలుంద‌ని తెలుస్తోంది. తెలుగు- త‌మిళ‌- హిందీ భాష‌ల్లో ఈ సినిమా తెర‌ పైకి వ‌చ్చే అవ‌కాశం వుంది. రొటీన్ కి  భిన్న‌మైన చిత్రాల్ని తెర‌కెక్కించే వ్యూహం తో పాన్ ఇండియా కేట‌గిరీ లో సందీప్ ఎలాంటి  స్క్రిప్టు ను రెడీ చేస్తున్నారు? అన్న‌ది ఆస‌క్తి గా మారింది.


Tags:    

Similar News