హీరో నిఖిల్ కు కొత్త సినిమా విడుదల ముహూర్తం సరిగా సెట్ కావడం కావడం లేదు కాబోలు. మళ్ళీ వాయిదా పడినట్టు సమాచారం . నిజానికి మే 1 గట్టిగా ఫిక్స్ చేసుకుని ఆ మేరకు టీమ్ ప్రమోషన్ ని వేగవంతం చేసింది. నిఖిల్ కూడా వినూత్నంగా పబ్లిసిటీ చేస్తూ తన వంతుగా హైప్ తెచ్చే పనిలో ఉన్నాడు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో మరోసారి పోస్ట్ పోన్ తప్పలేదని తెలిసింది. ఈసారి కారణం చాలా జెన్యూన్ గానే ఉంది.
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ రివ్యూలతో సంబంధం లేకుండా నాలుగు తెలుగు సినిమాలు మంచి రన్ లో ఉన్నాయి. మజిలీ వచ్చి నెలకు దగ్గరలో ఉన్నప్పటికీ యూత్ కి ఇప్పటికీ ఛాయస్ గా నిలుస్తోంది. చిత్రలహరి మరీ గొప్పగా కాకపోయినా డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. మరోవైపు జెర్సీకి వచ్చిన సూపర్ పాజిటివ్ టాక్ వసూళ్లను పెంచే దిశగా వెళ్తుందని ట్రేడ్ నమ్మకంతో ఉంది. ఇక కాంచన 3 నెగటివ్ కామెంట్లకు నెరవకుండా మాస్ ని లాగేస్తోంది
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎల్లుండి సునామిలా ముంచుకు వస్తున్న ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మీద క్రేజ్ చూసి మతులు పోవడం ఒక్కటే తక్కువైంది. ఐమ్యాక్స్ దగ్గర టికెట్ల కోసం ఏకంగా తెల్లవారుఝామున 6 గంటలకే క్యూ కట్టారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఐదు సినిమాల మధ్య ఇప్పటికిప్పుడు అర్జున్ సురవరంను తీసుకొస్తే అది ఈ తాకిడిలో ఓపెనింగ్స్ ని తగ్గించుకునే అవకాశం లేకపోలేదు.
కంటెంట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా అపోజిషన్ కూడా అలాగే ఉంది కాబట్టి బయ్యర్ల సూచన మేరకు ప్రస్తుతానికి అర్జున్ సురవరంని మే 1 నుంచి షిఫ్ట్ అయితే చేశారు. కొత్త డేట్ కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ జరగడం కూడా సందేహంగానే ఉంది. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన అర్జున్ సురవరంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది