టెర్మినేటర్ పాత్రలో హాలీవుడ్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ చేసిన సాహసాల్ని అంత సులువుగా మర్చిపోలేం. ఐతే తెర మీద ఎన్ని సాహసాలు చేసినా నిజజీవితంలో ప్రమాదకర పరిస్థితి ఎదురైతే కంగారు తప్పదు. ఆర్నాల్డ్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు. ఆఫ్రికా అడవుల్లో సరదాగా వెకేషన్ కు వెళ్లిన ఆర్నాల్డ్.. అతడి మిత్రులకు భయానక అనుభవం ఎదురైంది. ఓ ఏనుగు వారి మీద దాడి చేయబోగా త్రుటిలో తప్పించుకున్నారు. ఈ వ్యవహారమంతా ఆర్నాల్డ్ బృందం వీడియోలో రికార్డు చేయడం విశేషం.
ఆర్నాల్డ్.. అతడి స్నేహితులు రోడ్డుపై సఫారీ జీపు నడుపుకుంటూ వెళ్తుండగా.. ఉన్నట్లుండి భారీగా ఉన్న ఓ ఏనుగు ఎదురైంది. దీంతో వాళ్లు వాహనాన్ని ఆపేశారు. ఏనుగు వారిని సమీపించి.. తొండంతో వాహనాన్ని తడిమి తడిమి చూస్తుంటే జీపులో ఉన్నవాళ్లు ఊపిరి బిగబట్టి చూశారు. కొన్ని క్షణాల తర్వాత ఏనుగు వెనక్కి మళ్లి రోడ్డు నుంచి పక్కు వెళ్లింది. ఐతే మళ్లీ చుట్టు తిరిగి జీపు వెనుక నుంచి వీళ్లకు సమీపంగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ జీపు వేగం పెంచి దూసుకెళ్లాడు. ఏనుగు ఆశ్చర్యకరంగా పరుగు అందుకుని జీపు అందుకోవడానికి దూసుకొచ్చింది.
ఐతే జీపు వేగం మరింత పెంచి తప్పించుకుంది ఆర్నాల్డ్ బృందం. ఈ అనుభవం గురించి ఆర్నాల్డ్ చెబుతూ.. ‘‘ఇదంతా సినిమా అయితేనే బాగుండేదేమో. నేను నిజంగా ఆ జంతువును చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. అది చాలా బలమైన ఏనుగు. మాలో కొంతమంది ప్యాంట్లు కూడా మార్చుకోవాల్సి వచ్చింది’’ అన్నాడు. మరి ఆ ప్యాంట్లు మార్చుకున్న వాళ్లలో ఆర్నాల్డ్ కూడా ఉన్నాడేమో.
Full View