ఈ మధ్యే ఒక సీనియర్ కమెడియన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మీరు కారవాన్ డిమాండ్ చేస్తున్న మాట వాస్తవమా’ అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన.. ‘‘నేను డిమాండ్ చేస్తున్నాను అనే దాని కంటే నిర్మాతలే ఇస్తున్నారు అనుకోవచ్చు కదా. కమెడియన్లకు కూడా కారవాన్ ఇచ్చే గౌరవం తెచ్చిన వ్యక్తిగా నన్ను గుర్తించవచ్చు’’ కదా అన్నారు. ఈ విషయంలో ఆయన అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. ఒకప్పుడు పెద్ద హీరోలు, హీరోయిన్లకు మాత్రమే పరిమితమైన ‘కారవాన్ కల్చర్’ ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులకు, కమెడియన్లకు కూడా విస్తరిస్తుండటం పట్ల నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు షూటింగ్ స్పాట్ లోనో, లేదంటే చెట్ల కిందో తెరలు కట్టించుకుని అసిస్టెంట్ల సాయంతో డ్రెస్ చేంజ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు చిన్న స్థాయి ఆర్టిస్టులు సైతం కారవాన్లు డిమాండ్ చేస్తుండటంతో నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ మధ్య ఒక సినిమా షూటింగ్ స్పాట్ లోనూ మూడు నాలుగు కారవాన్లు దర్శనమిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కారవాన్ ఉంటే తప్ప షూటింగుకి రామంటూ కొంచెం డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు మొండికేస్తుండటం నిర్మాతలకు తలనొప్పిగా మారింది. దీని వల్ల ఖర్చు భారీగా పెరిగిపోతుండటమే కాక.. చాలా టైం కూడా వేస్ట్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.
కారవాన్ ఎక్కిన ఆర్టిస్టులు ఒక పట్టాన బయటికి రావట్లేదని.. అందులోనూ కాస్త ఎండ ప్రభావం ఉంటే షూటింగ్ ఆలస్యమవుతోందని చెప్పినా కారవాన్ దిగట్లేదని అంటున్నారు. అందులోనూ చిన్న సినిమాల నిర్మాతలకైతే కారవాన్ అనేది పెద్ద భారం అవుతోంది. గతంలో దిల్ రాజు కారవాన్లను బ్యాన్ చేయాలంటూ ధర్నాకు కూడా దిగాడు. కానీ ఫలితం లేకపోయింది. ఐతే అప్పటి కంటే ఇప్పుడు పరిస్థితి ఇబ్బంది కరంగా మారింది. దీంతో నిర్మాతలందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఈ విషయంలో ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని భావిస్తున్నారు.