ప్రతీ సినిమా ప్రదర్శన ప్రారంభానికి ముందు జాతీయగీతం జనగణమన తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం విమర్శలకు గురవుతోంది. సోషల్ మీడియా వేదికగా నేరుగానే కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ధృవ విలన్ అరవింద్ స్వామి కూడా కోర్టు ఆదేశాలపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
'సగౌరవంగానే ప్రశ్నించాలని అనుకుంటున్నా. ప్రతీ సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతం ఎందుకు ప్రదర్శించాలి? ఎవరైనా చెప్పగలరా? దేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈవెంట్ లోనో.. స్పోర్ట్స్ ఈవెంట్ లోనో.. వేలకొద్దీ ప్రజలు గుమిగూడిన చోటో దేశానికి ప్రాతినిధ్యంగా ఈ గీతం ఆలపించచ్చు. కానీ తలుపులు మూసేసి ఉండే థియేటర్లలో ఈ గీతాల అవసరం ఏంటి. 1997లో ఉపాహార్.. ఘోరమైన సంఘటన. బయకు దారి లేకుండా చేయడాన్ని సమర్ధించవద్దు' అంటూ చెప్పుకొచ్చాడు అరవింద్ స్వామి.
ఢిల్లీలోని థియేటర్ లో జరిగిన ఆ ఘటనలో 53మంది అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుండడంతో.. సుప్రీం తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షిస్తుందా ?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/