అన్ని ఇండస్ట్రీల్లోనూ మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. కోలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న టాప్ లిస్టు మల్టీ స్టారర్ సినిమాల్లో ‘ఎనిమి’ కూడా ఒకటి. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య నటిస్తున్నారు. విశాల్ హీరో పాత్రలో నటిస్తుండగా.. ఆర్య విలన్‌గా కనబడనున్నారు. అనౌన్స్ నుంచే క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం నుంచి.. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.
అయితే.. విడుదలైన పోస్టర్లన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే.. ఆ పోస్టర్లలో ఎక్కడా ఆర్య కనిపించలేదు. దీంతో.. లేటెస్ట్ గా ఆర్య ‘ఫస్ట్ లుక్’ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో కేవలం ఆర్య మాత్రమే ఉన్నాడు. పోస్టర్ మొత్తాన్ని ఆక్రమించిన ఆర్య.. దెబ్బతిన్న బెబ్బులిలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లాక్ అండ్ వైట్ కలర్ లో రిలీజ్ చేశారీ ఫస్ట్ లుక్ ను. చేతికి సంకెళ్లతో.. ముఖానికి తగిలిన దెబ్బలతో ఆగ్రహంగా కనిపిస్తున్నాడు ఆర్య. ఒక ఫైటింగ్ సీన్ మాదిరిగా కనిపిస్తోంది. ఈ పోస్టర్.. సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.