ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందన్నంతలోనే చనిపోయారు

Update: 2023-02-19 10:54 GMT
తెలుగు తెరకు ఇటీవల పరిచయమైన బ్యూటీల్లో కాస్త బజ్ ఎక్కువగా ఉన్న కన్నడ భామ అశికా రంగనాథ్. ఈ మధ్యన విడుదలైన అమిగోస్ మూవీలో ఆమె తళుక్కున మెరిశారు. అనుకోని రీతిలో సినిమాల్లోకి వచ్చిన ఆమె.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

తనకు వచ్చిన అవకాశాన్నిఅందిపుచ్చుకొని తానేమిటో ఇప్పటికే ఫ్రూవ్ చేసుకున్న ఆమె.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో సరదాగా పాల్గొంటే.. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డు దక్కిందన్నారు. ఆ ఫోటోలు బయటకు వచ్చి.. క్రేజీబాయ్ మూవీలో ఛాన్సు లభించిందన్నారు. తన సోదరి కూడా ఇండస్ట్రీలో ఉండటంతో తనకు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగినట్లు చెప్పారు.

తన తల్లికి చిన్నతనంలో సంగీతం నేర్చుకోవాలని అనుకున్నా.. ఆమె ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించే వారు లేకపోవటంతో ఆమె ఆసక్తి కలగానే ఉండిపోయిందని.. తాను అలా కాకూడదని చిన్నప్పటి నుంచే తన తల్లి తనకు డ్యాన్స్ నేర్పించినట్లుగా పేర్కొంది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించాలన్న కోరిక ఉండేదని.. తాను కోరుకున్నట్లే ఆయన్ను తాను రెండు, మూడుసార్లు కలిశానని.. చివరకు ఆయనతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు చెప్పారు.

అయితే.. అనుకోకుండా కొన్నాళ్లకే ఆయన మరణించటంతో ఆ కోరిక కలగా మిగిలిపోయిందన్నారు. ఫ్యూచర్ లో రాజమౌళి మూవీలో నటించాలన్న కోరిక తనకు ఉందన్నారు. మరి.. ఆమె కోరిక తీరాలని ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News