తమిళమ్మాయ్‌ కు కూతురు పుట్టింది

Update: 2017-10-25 04:21 GMT
తమిళమ్మాయ్‌ కు కూతురు పుట్టింది అంటే చాలామంది తమిళ అమ్మాయిలు ఉంటారు కదా.. ఎవరబ్బా అనుకుంటున్నారా? అదేనండీ.. ’అమ్మానాన్నా ఓ తమళమ్మాయ్‘ సినిమాతో మన తెలుగోళ్లకు గిలిగింతలు పెట్టిన అసిన్ తొట్టుముక్కల్ ఉంది చూశారూ.. ఆ హీరోయిన్ గురించే ఈ డిస్కషనంతా.

2016లో మైక్రోమ్యాక్స్ సంస్థ సిఇఓ రాహుల్ ను పెళ్ళిచేసుకుంది అసిన్. అంతకుముందు ఓ రెండు సంవత్సరాలపాటు వారు ప్రేమలో ఉన్నారు. అయితే ఈమె ప్రెగ్రెంట్ అనే విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు కాని.. తమకు నిన్న కూతురు జన్మించినట్లు ఇప్పుడు అసిన్ స్వయంగా ప్రకటించిందిలే. మరి పెళ్ళిచేసుకున్న వెంటనే మాతృత్వాన్ని కూడా ఆస్వాదించాలి కదా.. అందుకే తన లైఫ్‌ ను అలా ప్లాన్ చేసుకుని ఉంటుంది.

ఏదేమైనా కూడా అసిన్ మాత్రం.. ఒక ప్రక్కన సౌత్‌ లో ఆమెకు సినిమా ఆఫర్లు క్యూ కట్టేస్తున్న వేళ.. వాటన్నింటినీ వదిలేసుకుని బాలీవుడ్ వెళ్ళి చతికిలపడింది. అక్కడ గ్లామర్ పాత్రలను చేద్దామని ప్రయత్నించినా కూడా.. అస్సలు వర్కవుట్ కాలేదు.ఇక ప్రస్తుతానికి పెళ్లి తరువాత యాక్టింగ్‌ కు గుడ్ బాయ్ చెప్పేసింది అంతే.
Tags:    

Similar News