ఆస్కార్‌ లో ఆ రెండూ ఫెయిల్‌.. కార‌ణ‌మిదే!

Update: 2018-09-24 12:11 GMT
2019 ఆస్కార్ బ‌రిలో పోటీప‌డే ఇండియ‌న్ సినిమాగా అస్సామీ చిత్రం `విలేజ్ రాక్‌ స్టార్స్` ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అయితే భారీ బ‌డ్జెట్ .. భారీ టెక్నికాలిటీస్ ఉన్న ప‌ద్మావ‌త్ 3డి - రాజీ చిత్రాల్ని ఈసారి ఆస్కార్ సెల‌క్ష‌న్ ఇండియా జూరీ క‌మిటీ ఎంపిక చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాల్ని ఇన్‌ సైడ్ సోర్స్ విశ్లేషిస్తోంది.

ఈసారి భ‌న్సాలీ-ప‌ద్మావ‌త్‌ - మేఘ‌నా గుల్జార్ - రాజీ చిత్రాలు రేసులో గ‌ట్టిగానే పోటీనిచ్చాయి. ఫైన‌ల్ చేసిన నాలుగు సినిమాల్లో ఈ రెండు సినిమాల పేర్లు ఉన్నాయి. వీటితో పాటు సుర్జీత్ సిర్కార్ తెర‌కెక్కించిన అక్టోబ‌ర్ చిత్రాన్ని- అస్సామీ చిత్రం విలేజ్ రాక్‌ స్టార్‌ ని క‌మిటీ తీవ్రంగా ప‌రిశీలించింది. అయితే రాజీ సినిమాని క‌మిటీ ప‌క్క‌న పెట్ట‌డానికి స‌హేతుక కార‌ణం ఉంది. ఈ సినిమా ప్రో-పాకిస్తానీ కంటెంట్ జూరీ స‌భ్యుల్ని ఆలోచింప‌జేసిందిట‌. ఈ విష‌యంలో కొంద‌రు క‌మిటీ స‌భ్యులు అభ్యంతరాలు వ్య‌క్తం చేశారు. ఇక భ‌న్సాలీ ప‌ద్మావ‌త్ 3డి చిత్రాన్ని ప‌రిశీలించిన‌ప్పుడు అందులో భ‌న్సాలీ పాత సినిమాల‌న్నీ క‌నిపించాయట‌. అవే భారీ కాస్ట్యూమ్స్ డ్రామాలు - అవే నేపద్యం అంటూ ప‌క్క‌న పెట్టేశారు.

అయితే సుర్జీత్‌ జీ తెర‌కెక్కించిన అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కూ రిమా దాస్ - విలేజ్ రాక్‌ స్టార్స్‌ తో పోటీప‌డింది. కానీ చివ‌రికి ఆ స్క్రిప్టుతో ప్లాగ‌రిజం (కాపీ) స‌మ‌స్య త‌లెత్తిందిట‌. గ‌త ఏడాది న్యూట‌న్ సినిమాని ఎంపిక చేసిన‌ప్పుడు దానిపై కాపీ క్యాట్ విమ‌ర్శ‌లు చెల‌రేగడంతో ఆస్కార్ వేదిక‌పై ప‌రువు పోయింది. అందుకే ఈసారి ఆ త‌ప్పు చేయ‌ద‌ల‌చుకోలేదు. ఆ క్ర‌మంలోనే ఒరిజిన‌ల్ ఫ్రెష్ స్క్రిప్ట్‌ తో ఉన్న విలేజ్ రాక్ స్టార్స్ ఫైన‌ల్‌ గా ఆస్కార్ విదేశీ కేట‌గిరీలో ఇండియా త‌ర‌పున ఎంపికైంది. అంత క‌థ ఉంద‌న్న‌మాట‌. అయితే జ‌న‌వ‌రిలో అవార్డులు అందిస్తారు. అప్ప‌టివ‌ర‌కూ విలేజ్ రాక్‌ స్టార్స్‌ సినిమాకి ప్ర‌చారం చేయ‌డం - లాబీయింగ్ చేయ‌డం అంటే చాలానే ఖ‌ర్చ‌వుతుంది. అంత మొత్తాన్ని నిర్మాత‌లు పెట్ట‌లేరు. కాబ‌ట్టి దీనిని ప్ర‌మోట్ చేసే బాధ్య‌త‌ల్ని కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాలే తీసుకుంటాయ‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News