ఏడాది కాలంగా యువజంట రణబీర్ - ఆలియా పెళ్లి వ్యవహారం అంతకంతకు డైలమాలో పడిపోతూనే ఉంది. బోలెడన్ని బ్రేకప్ లు.. అలకలు.. కలతలు.. దీంతో పాటే ఇంట్లో అశుభాలు.. ఇదంతా చూస్తుంటే దోషం ఎక్కడుంది? అన్న టెన్షన్ తప్పడం లేదు. దీనిపై ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
2019 అక్టోబర్ లోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని మీడియా కథనాలు వెలువడ్డాయి. కానీ ఎందుకనో ఆ శుభకార్యం కాస్తా అంతకంతకు వాయిదా పడుతూనే ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరికీ సభ్యసాచి డిజైన్స్ కూడా రెడీ అయ్యాయని అన్నారు. కానీ ఏదీ ముందుకు వెళ్లలేదు. అందుకు గ్రహాల స్థితిగతులకు సంబంధించిన సమస్య ఏదైనా ఉందా? అంటే ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
``ఆ ఇద్దరి జాతకాలు కలిసాయి. పెళ్లి జరిగితే ఇద్దరి కెరీర్ ధేధీప్యమానంగా వెలిగిపోతుంది. కానీ ఆలియా జాతకంలో ఉన్న ఆ చిన్నపాటి దోషం వల్ల రకరకాల కన్ఫ్యూజన్స్ తలెత్తుతాయ``ని ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు ఆచార్య వినోద్ చెబుతున్నారు. ఆ చిన్న దోషాన్ని సరి చేయాల్సి ఉంటుందని చెప్పాడు.
రణబీర్ తో ఆలియాకు చెడిందని ఆ ఇద్దరూ విడిపోయారని ఇటీవల ప్రచారమైంది. అప్పట్లో ఆలియా బర్త్ డే వేడుకలో రణబీర్ కనిపించ లేదు. దాంతో రకరకాల సందేహాలు తలెత్తాయి. ఆ తర్వాత మళ్లీ జంటగా కలిసిపోయారు. రీసెంట్ గానే రణబీర్ తండ్రి రిషీ కపూర్ చనిపోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. ఇప్పుడు విషాదం తర్వాత ఇంట్లో శుభకార్యం జరిగితే పాత విషయాన్ని మర్చిపోయేందుకు వీలుంటుందని భావిస్తున్నారట. ఆ క్రమంలోనే జ్యోతిష్కులు ఇలా చెబుతున్నారు. `శుక్ర` గ్రహం బాగానే ఉంది. కానీ కన్ఫ్యూజన్స్ .. మనస్ఫర్థలు తప్పవు అని వెల్లడిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా పెళ్లాడి అన్నిటికీ చెక్ పెట్టేయాల్సిందేనని చెబుతున్నారు. కరోనా వల్ల రణబీర్ - ఆలియా జంట నటించిన బ్రహ్మాస్త్ర రిలీజ్ సందిగ్ధం లో పడింది. అలాగే ఆలియా నటించిన పలు భారీ పాన్ ఇండియా చిత్రాలు క్రైసిస్ లో పడిన సంగతి తెలిసిందే.